‘‘గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం తెలుగు భాషకు, జాతికి తీరని లోటు. తన అమృతగానం ద్వారా తెలుగు, భాష, సాహిత్య చరిత్రలను సజీవంగా ఉంచడమే కాకుండా ప్రజ్వరిల్లింపజేసిన మహనీయుడు ఆయన. సుస్వర మాధుర్యంతో యావత్ ప్రపంచాన్ని ఆనందసాగరంలో ఓలలాడించిన గొప్ప మనిషి. తన అమరగానం ద్వారా తెలుగుభాషలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది సంగీత ప్రియుల హృదయాలను కొల్లగొట్టి యావత్ సంగీత సామ్రాజ్యాన్ని అప్రతిహతంగా ఏలిన జైత్ర యాత్రికుడు. ఇప్పుడు తన సంగీత సంపదనంతా భువిలోనే వదిలిపెట్టి స్వర్గలోకంలోని గంధర్వుల సమక్షంలో అమృత గానాన్ని వినిపించడం కోసం వెళ్లిన ఆ మహనీయుడు భౌతికంగా మనకు దూరమైనా గాత్రపరంగా తెలుగుజాతి ఉన్నంత వరకూ అందరి హృదయాల్లో ఉండిపోతారు’’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు.
బాలు మన హృదయాల్లో చిరంతనంగా ఉండిపోతారు
Related tags :