రాష్ట్రంలో ఉల్లి ధర మళ్లీ ఘాటెక్కింది. మొన్నటి దాకా రూ.50కి 3కిలోలు అమ్మిన ఉల్లిపాయలు ఇప్పుడు రిటైల్‌గా కిలో రూ.50 పలుకుతోంది. ధర ఇంకాస్త పెరిగే సూచనలు కన్పిస్తున్నాయి. నెల రోజులుగా కురిసిన అధిక వర్షాలకు ఉల్లి పంట చాలా దెబ్బతింది. పాయలు నాణ్యత లోపించాయి. దీంతో గత పక్షం రోజులు కర్నూలు మార్కెట్‌లో క్వింటా రూ.3వేలు పలికిన సరుకు ఇప్పుడు రూ.2,700 మాత్రమే పలుకుతోంది. రైతుకు ఎక్కువ ధర లభించకపోయినా, వ్యాపారులు ధరలు పెంచారు.
కిలో ₹50
Related tags :