DailyDose

రకుల్ ప్రీత్ అరెస్ట్ తప్పదా?-నేరవార్తలు

రకుల్ ప్రీత్ అరెస్ట్ తప్పదా?-నేరవార్తలు

* తెలుగు రాష్ట్రాల్లో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఫేస్ బుక్ కేంద్రంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసులను టార్గెట్ చేసుకుని సైబర్ నేరగాళ్లు దోపిడీకి దిగుతున్నారు. పోలీసుల పేరుతో ఫేక్ అకౌంట్ లను క్రియేట్ చేసి ఆ ఎకౌంట్ల ద్వారా డబ్బు కావాలంటూ మెసేజ్ లు పెట్టి అందినకాడికి దోచుకుంటున్నారు. ఒక్క తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటి వరకు 50మంది పోలీసు అధికారుల పేర్లతో సైబర్ నేరగాళ్ళు ఫేక్ అకౌంట్స్ తెరిచారని ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు అధికారులు .

* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై వైకాపా రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తనపై కరోనా కేసు పెట్టి కరోనా అంటించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోందని ఆరోపించారు.

* బాలీవుడ్ డ్రగ్స్ కేసులో ప్రముఖ కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) విచారణకు శుక్రవారం హాజరైంది. ఈ విచారణ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించినట్టు వార్తలు వస్తున్నాయి. తానెప్పుడూ డ్రగ్స్ సేవించలేదని, డ్రగ్ చాట్ మాత్రం చేశానని రకుల్ అంగీకరించిందట. అలాగే రియాతో డ్రగ్స్ గురించి మాట్లాడినట్టు, రియా కోరిన మేరకు తన ఫ్లాట్‌లో డ్రగ్స్ దాచినట్టు రకుల్ అంగీకరించిందట.

* ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పెంచికలపాడు గ్రామ సమీపంలో కొత్త చెరువు వాగు లో బొంత పెద్ద అంకయ్య అనే వ్యక్తి వాగులో చిక్కుకున్నాడని తెలిసి బేస్తవారిపేట ఎస్ఐ బాలకృష్ణ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.

* వివేకా హత్య కేసుపై కోనసాగుతున్న సీబీఐ విచారణ…కేంద్ర కారాగార అతిథి గృహం కేంద్రంగా విచారణ చేస్తున్న మూడు సిబిఐ బృందాలు..నాల్గవ రోజు విచారణకు హాజరైన కడప పట్టణానికి చెందిన ఇద్దరు ముస్లిం మహిళలు పులివెందులకు చెందిన బాబు .గతంలో ఇద్దరు మహిళలను పలు కోణాల్లో విచారించిన సీబీఐ.ఈ ఇద్దరు మహిళలలో మున్నా రెండో భార్య ఉన్నట్లు సమాచారం.