WorldWonders

చపాతీ పట్ల నిర్లక్ష్యం…ప్రభుత్వోద్యోగి సస్పెన్షన్

చపాతీ పట్ల నిర్లక్ష్యం…ప్రభుత్వోద్యోగి సస్పెన్షన్

సాక్షాత్తు ముఖ్యమంత్రి పర్యటనకు వస్తే, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఓ అధికారి సస్పెండైన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అయితే ఆయన చేసింది పెద్ద తప్పేం కాదంటూ స్వయంగా సీఎం కలగజేసుకుకొని సదరు అధికారిని తిరిగి విధుల్లోకి తీసుకుంటూ ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్లే..ప్రొటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి, ఆయన వెంట వచ్చిన అధికారులకు సరైన ఆహారం అందించడం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌ విధి. ఆ సమయంలో విధుల్లో ఉన్న స్వామి అనే అధికారి పొరపాటున మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ బుధవారం ఇండోర్‌లో పర్యటించిన సందర్భంగా చల్లటి చపాతీలు వడ్డించారు. దాంతో విధులు సక్రమంగా నిర్వర్తించలేదన్న కారణంతో ఆయనపై వేటు పడింది. కాగా, ఈ విషయం శివరాజ్‌ సింగ్‌కు తెలియడంతో వెంటనే ఆయన్ను విధుల్లోకి తిరిగి తీసుకోవాంటూ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. తాను ఒక సాధారణ వ్యక్తినని, పొడిబారిన, చల్లటి చపాతీలు తినడాన్ని తాను పట్టించుకోనని వెల్లడించారు. అలాగే ఇంత చిన్న విషయానికి ఒక అధికారిని సస్పెండ్ చేయకూడదంటూ ఉన్నతాధికారులకు సూచించారు. పూర్తి నిబద్ధతతో ప్రభుత్వానికి సేవలు అందించాలంటూ ఈ సందర్భంగా ఆయన ఉద్యోగులకు పిలుపునిచ్చారు.