Health

ఇండియాలో ఆగని కరోనా కేళి-TNI బులెటిన్

India Records Huge Number Of Cases In One Day

* దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.గత 24 గంటల్లో కొత్తగా 85,362 కొత్త కేసులు నమోదు కాగా, 1,089 మంది మృత్యువాత పడ్డారు. దీంతో భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 59,03,933కు చేరింది.ఇందులో 9,60,969 యాక్టివ్ కేసులు ఉండగా, 48,49,585 మందికి స్వస్థత చేకూరి డిశ్చార్జి అయ్యారు.మృతుల సంఖ్య 93,379కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

* రాష్ట్రంలో కొత్తగా 7,293 కరోనా కేసులు, 57 మరణాలు.రాష్ట్రంలో6,68,751కి చేరిన కరోనా బాధితుల సంఖ్య.రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 5,663 మంది మృతి.రాష్ట్రంలో ప్రస్తుతం 65,794 కరోనా యాక్టివ్‌ కేసులు.రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న 5,97,294 మంది బాధితులు.

* కరోనా మహమ్మారి విలయతాండవానికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్‌ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. కానీ, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక దాన్ని కొనుగోలు చేసి, పంపిణీ చేయడం ఇప్పుడు అది పెద్ద సవాలని ఇప్పటికే చాలామంది నిపుణులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా భారత్ లాంటి అధిక జనాభా కలిగిన దేశంలో ఇది క్లిష్టమైన వ్యవహారంగా మారనుంది. దీన్ని ఉద్దేశించి ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) సీఈఓ అదర్‌ పూనావాలా ప్రభుత్వానికి ఓ ప్రశ్నను సంధించారు. కొవిడ్ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి, పంపిణీ చేయడానికి వచ్చే సంవత్సర కాలానికి కేంద్రం రూ.80వేల కోట్లను ఖర్చుచేయగలదా?అని ప్రశ్నించారు. దీనికి సంబంధించి ఆయన ట్వీట్‌ చేశారు.

* ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. వైరస్‌ వ్యాప్తి రాష్ట్రంలో తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. నిన్నటితో పోలిస్తే తాజాగా కేసులు పెరిగాయి. గడిచిన 24గంటల్లో 75,990 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 7293 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కొత్తగా మరో 57మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు మొత్తంగా 55,23,786 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 6,68,751 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరిలో 5663 మంది మృత్యువాత పడగా.. 5,97,294మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 65,794 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో 1011 కేసులు నమోదు కాగా.. పశ్చిమగోదావరి జిల్లాలో 922 పాజిటివ్‌ కేసులు వచ్చాయి. అలాగే, చిత్తూరులో 975, ప్రకాశం 620, కడప 537, అనంతపురం 513 చొప్పున అత్యధిక కేసులు నమోదయ్యాయి.