నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా 18,000 పైచిలుకు కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పోల్చుకుంటే కేరళలో రోజువారీ నమోదవుతున్న కేసులు స్వల్పమే. అయితే కొత్త కేసులు నమోదవుతున్న రేటు మాత్రం చాలా ఎక్కువగా ఉంది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కేసుల రేటు 1.53శాతం కాగా.. కేరళలో ఇది దాదాపు రెట్టింపు కంటే ఎక్కువగా 3.51 శాతం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 1.12 లక్షల కేసులు ఉన్నాయి. ఇదే పెరుగుదల రేటు కొనసాగితే..దేశంలోనే అత్యంత ఎక్కువ కేసులు కలిగిన తొలి 10 రాష్ట్రాల్లో కేరళ నిలిచే అవకాశమూ లేకపోలేదు. కొత్తగా అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో కేరళ నాలుగో స్థానంలో ఉంది. మరోవైపు క్రియాశీల కేసుల సంఖ్య కూడా కేరళలో అధికంగానే ఉంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం కనీసం 49,000 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇది దేశంలోనే ఐదో స్థానం. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్ దీని ముందుస్థానాల్లో ఉన్నాయి.
కేరళలో భారీగా కేసులు
Related tags :