NRI-NRT

గల్ఫ్ కార్మికులు ICBF బీమాను ఉపయోగించుకోవాలి

Qatar Jagruti President Nandini Requests Gulf Labor To Make Use Of ICBF Insurance

తెలంగాణ గల్ఫ్ కార్మికులు ICBF ప్రమాద భీమా పథకాన్ని ఉపయోగించుకోవాలి: తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని.

ఖతర్ లో నివసించే భారతీయ పౌరులకోసం ICBF వారి భీమా పథకం పునః ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి కార్యవర్గం పాల్గొనడం జరిగింది.
ఖతార్‌లోని తెలుగు కమ్యూనిటీ కోసం ప్రత్యేకంగా ఐసిబిఎఫ్ వారు జూమ్ సమావేశం నిర్వహించారు.

తెలంగాణ జాగృతి ఖతర్ అధ్యక్షురాలు నందిని అబ్బగౌని
తెలంగాణ గల్ఫ్ కార్మిక సోదరులు ఈ భీమా పథకాన్ని ఉపయోగించుకోవాలని మనవి,
ఉహించని సంఘటనలు జరిగితే మీ కుటుంబానికి మెరుగైన జీవితం కోసం ఆసరాగా ఉపయోగించుకోవాలని తెలంగాణ జాగృతి ఖతర్ ద్వారా కోరుతున్నం అని తెలిపారు.
కేవలం 125 రియాల్ ల ప్రీమీయం తో దాదాపు 20 లక్షల ప్రమాద భీమా సౌకర్యం ఉంటుంది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ICBF కార్యవర్గం తో పాటు తెలంగాణ జాగృతి ఖతర్ నాయకులు హారిక ప్రేమ్ , సాయి చింతలపూడి, స్వప్న కేశా, ఎల్లయ్య తాళ్లపెళ్లి, అహ్మద్ మొహిద్దిన్, చందన రెడ్డి, ప్రగతి, రేఖా సాయి,రాజేశ్వరి రుద్ర తదితరులు పాల్గొన్నారు.