అమెరికాలో నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన ఓటును అంతరిక్షం వేయనున్నట్లు నాసా మహిళా వ్యోమగామి కేట్ రూబిన్ తెలిపారు. భూమికి 200 మైళ్ల దూరంలో ఉన్న అంతర్జాతీయ స్పేస్ కేంద్రానికి అక్టోబరులో పయనమవుతున్న కేట్ ఆరు నెలల పాటు అక్కడే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో తన ఓటును అక్కడి నుంచి వేస్తానని ఆమె వివరించారు. సమాజంలో ఓటుకు చాలా విలువ ఉందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అంతరిక్షం నుంచి ఓటు వేయడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. వ్యోమగాములు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అక్కడి చట్టాలు అనుమతిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ బ్యాలెట్ ద్వారా వారు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
ట్రంప్ భవిత తేల్చనున్న అంతరిక్ష వ్యోమగామి ఓటు
Related tags :