యూఏఈలో దేశ బహిష్కరణకు గురైన ప్రవాస భారతీయుడు 14 ఏళ్ల తర్వాత 1,39,177 అమెరికా డాలర్లు(సుమారు రూ.1.02 కోట్లు) జరిమానా మాఫీ పొంది.. స్వదేశానికి తిరిగి వచ్చేందుకు అనుమతి పొందారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బస్కరి రాఘవులుకు న్యాయపరమైన సాయం చేసిన స్థానిక సామాజిక కార్యకర్త, న్యాయవాది షీలా థామస్ అతడికి విమాన టికెట్ కూడా కొనిచ్చారని ‘గల్ఫ్ న్యూస్’ పత్రిక పేర్కొంది. ‘‘అతను వసతి కోసం కష్టపడుతున్నారు. స్వదేశానికి తిరిగి వెళ్లి తన కుమార్తెను మొదటిసారి చూడాలనుకున్నారు’’ అని షీలా థామస్ తెలిపారు. 2006లో ఉపాధి కోసం యూఏఈకి వచ్చిన రాఘవులు తను పని చేసే కంపెనీ వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. కంపెనీ నుంచి పరిహారం పొందేందుకు తీవ్రంగా కృషిచేశాడని స్థానిక వార్తాపత్రిక పేర్కొంది.
ప్రవాసాంధ్రుడికి కోటి రూపాయిల జరిమానా మాఫీ
Related tags :