ఇటీవల భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్, టీమిండియా కెప్టెన్ కోహ్లి భార్య అనుష్క శర్మల మధ్య వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై ఇప్పటికే గావస్కర్‌కు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మద్దతుగా నిలవగా, తాజాగా మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ కూడా అండగా నిలిచారు. ‘నాకు గావస్కర్ గురించి బాగా తెలుసు. అది గావస్కర్ కాస్త జోక్‌గా చెప్పారనే నేను అనుకుంటున్నా. ఇందులో ఎటువంటి తీవ్రత లేదు. దీనిపై రాద్దాంతం అనవసరం.’ అని ఫరూక్ అన్నారు. గతంలో అనుష్క శర్మను విమర్శించిన క్రమంలో తనపై కూడా ఇలానే విమర్శలు వచ్చాయన్నారు. ఆ వివాదాన్ని కూడా రాద్దాంత చేశారని ఫరూక్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో టీమిండియా సెలక్టర్లను విమర్శించే క్రమంలో అనుష్క శర్మకు టీ కప్పులు ఇవ్వడానికి వెళ్లారా అంటూ ప్రశ్నించడాన్ని తప్పుబట్టారు. 82 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్.. ‘ అనుష్కను నేను కానీ గావస్కర్ కానీ ఎందుకు విమర్శిస్తాం. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి అనుష్క అందమైన భార్య. వారిని విమర్శించే అవసరం మాకు లేదు. గావస్కర్ ఏదో సరదాగా వ్యాఖ్యానించి ఉంటారు. అంతేకానీ వేరే ఉద్దేశం ఉండదని నా అభిప్రాయం’ అని ఫరూక్ పేర్కొన్నారు.
గవాస్కార్కు మద్దతు
Related tags :