కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుండగా.. పలు రాష్ట్రాలు స్కూళ్లు, కాలేజీలను తిరిగి ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నాయి.
మరికొన్ని రాష్ట్రాలైతే అవి ప్రారంభమయ్యే తేదీలను కూడా ప్రకటించాయి.
ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్ర ప్రభుత్వం. ఏ రాష్ట్రంలో కూడా స్కూళ్లు, కాలేజీలు తిరిగి ఓపెన్ చేయడం కుదరదని తెలిపింది.
స్కూళ్లు, కాలేజీలు ఓపెన్ చేయడానికి తాము ఎలాంటి అనుమతి ఇవ్వలేదంది.