దివికేగిన దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మెమోరియల్ పై అయన తనయిడు ఎస్పీ చరణ్ స్పందించారు.. ఎస్పీబీ అభిమానుల కోసం స్మారక మందిరం నిర్మిస్తామని చరణ్ వెల్లడించారు. ఆ విగ్రహాన్ని అయన ఎంతో ఇష్టపడే తామరైపాక్కంలోని ఫార్మ్ హౌస్లోనే మా సొంత ఖర్చులతో నిర్మిస్తామని చరణ్ తెలిపారు.. తెలుగు, తమిళ భాషలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న నాన్న గారి అభిమానులు ఆయన్ని స్మరించుకునేలా , ప్రజలు అందరూ వచ్చి సందర్శించేలా ఏర్పాటు చేస్తామని, దానిని ప్రజలకి అంకితం చేస్తాం చరణ్ వెల్లడించారు. అటు బాలు తన సొంత ఊరు నెల్లూరు లో ఉన్న తన ఇంటిని వేద పాఠశాలకు ఇస్తున్నానని, అక్కడ తన తల్లిదండ్రుల విగ్రహాలు పెట్టాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఆయన తల్లిదండ్రులు విగ్రహాలతో పాటుగా అయన విగ్రహాన్ని కూడా చేయించుకున్నారు బాలు.. కానీ ఆయనకి కరోనా సోకడం వలన అయన ఆ విగ్రహాలను ఆవిష్కరించ లేకపోయారు. ఇప్పుడు ఆ విగ్రహల దగ్గరే బాలు విగ్రహం కూడా అక్కడే ఆవిష్కరిస్తారని తెలుస్తోంది.
SPB స్మారక మందిరం నిర్మిస్తాం
Related tags :