ఆ రైల్వేస్టేషన్‌లోని ఓ బెంచీ మీద ఒక పక్కన కూర్చుంటే మద్యం తాగడం నేరం. మరోపక్కన కూర్చుంటే మద్యం తాగొచ్చు కానీ పాన్ మసాలా, గుట్కాలు నమలడం నేరం. ఎందుకంటే నవపూర్ రైల్వేస్టేషన్‌లోని ఆ బెంచీ మధ్యలోంచి మహారాష్ట్ర, గుజరాత్ సరిహద్దు రేఖ వెళ్లింది. బెంచీ మీద కూడా రెండు వైపులా రెండు రాష్ట్రాల పేర్లుంటాయి. దాంతో ఓ వైపు కూర్చుంటే మహారాష్ట్రలోనూ మరోవైపు కూర్చుంటే గుజరాత్‌లోనూ ఉన్నట్లన్నమాట. అలాగే గుజరాత్‌లోని మద్యపాన నిషేదం, మహారాష్ట్రలోని పాన్‌మసాలా, గుట్కాల నిషేధాలు కూడా వర్తిస్తాయి. ఇక, ఈ రైల్వేస్టేషన్‌లో టికెట్ కౌంటర్ మహారాష్ట్ర కిందికి వస్తే వెయిటింగ్ రూమ్, స్టేషన్ మాస్టర్ ఆఫీసులు గుజరాత్ పరిధిలోకి వస్తాయి. విచిత్రంగా ఉంది కదూ… అందుకే, ఇక్కడికొచ్చే ప్రయాణికులు ఈ బెంచీకి అటువైపూ ఇటువైపూ నిలబడి సరదాగా సెల్ఫీలు తీసుకుంటుంటారు. రైల్వేమంత్రి పీయూష్ గోయల్ కూడా ఈ బెంచీ ఫొటోను ట్విటర్‌లో షేర్ చేసి ‘రాష్ట్రాలు విడగొట్టాయి… రైల్వే కలిపింది’ అనే క్యాప్షన్ జతచేశారు.
ఈ రైల్వే బెంచీ సగం సగం
Related tags :