* కరోనా సమయంలో బయటకు వెళ్లి షాపింగ్ చేసేవాళ్ల సంఖ్య తగ్గిపోయింది.. ఇప్పుడిప్పుడే కాస్త పుంజుకుంటున్నా.. గతంలో ఉన్నస్థాయిలోమాత్రం లేదు. ఇదే సమయంలో.. ఈ-కామర్స్ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయాల్లా సాగుతోంది. ప్రతీసారి పండగ సీజన్‌లో ప్రత్యేక ఆఫర్లు, స్పెషల్ డిస్కౌంట్లతో కస్టమర్లను ఆకట్టుకోవానికి ఈ-కామర్స్ సంస్థలు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి.. ఇక, ఈ-కామర్స్ దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ పండగ సీజన్ వచ్చిందంటే చాలు.. భారీ డిస్కౌంట్లతో తమ సేల్స్‌ను అమాంతం పెంచుకుంటున్నాయి. ఈ ఏడాది కూడా పండుగ సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్‌తో ముందుకు రానుండగా.. అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’తో వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాయి రెండు సంస్థలు.
* మారటోరియం ప్లాన్ ఏమిటి?… కేంద్రానికి వారం రోజుల గడువు ఇచ్చిన సుప్రీంకోర్టు!లాక్ డౌన్ నుంచి మారటోరియంమరికొంత కాలం పొడిగించే ఆలోచనఅక్టోబర్ 5లోగా ప్రణాళిక ఇవ్వాలని కోర్టు ఆదేశంకరోనా మహమ్మారి ఇండియాలో విజృంభించడం మొదలైన తరువాత, లాక్ డౌన్ ప్రకటించిన వేళ, బ్యాంకులు ఇచ్చిన రుణాలకు సంబంధించి, రుణగ్రహీతల ఈఎంఐల చెల్లింపులపై తొలుత మూడు నెలలు, ఆపై మరో మూడు నెలల పాటు మారటోరియాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ గడువు ఇప్పటికే తీరిపోయింది. అయినప్పటికీ, మారటోరియాన్ని పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు, స్పందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.ఈ ఉదయం ఇదే కేసు విచారణకు రాగా, మారటోరియం ప్రణాళికను అందించేందుకు తమకు మరికొంత సమయం కావాలని కేంద్రం కోరడంతో, వారం రోజుల గడువు ఇస్తూ, కేసు తదుపరి విచారణను అక్టోబర్ 5కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. కాగా, ఇప్పటికే మారటోరియాన్ని పొడిగించేందుకు కేంద్రం సానుకూలంగా ఉన్న సంకేతాలు వెలువడ్డాయి. రెండేళ్ల పాటు దీన్ని అమలు చేయాలని కూడా కేంద్రం భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.ఈ కేసులో కేంద్రం, ఆర్బీఐ తరఫున ఈ ఉదయం విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, కొన్ని అంశాలు తన నియంత్రణలో లేవని, మారటోరియం పొడిగింపుపై ప్రభుత్వ ఆలోచనను తెలిపేందుకు మరింత సమయం కావాలని కోరారు. ఈ విషయంలో చర్చలు జరుగుతున్నాయని, అవి పూర్తి కావడానికి ఇంకొంత సమయం పడుతుందని తెలిపారు. దీనికి ధర్మాసనం అంగీకరించింది.
* దేశంలోని రక్షణ రంగ పరికరాలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కొత్తవిధానాన్ని అమల్లోకి తెచ్చింది. నేడు జరిగిన డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు సీడీఎస్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవాణే, వాయుసేన చీఫ్ బదౌరియా, నావికాదళాధిపతి కరమ్‌బీర్ సింగ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో త్రివిధ దళాలు ఆయుధాల కొనుగోలు విధానాలను మరింత సులభతరం చేశారు.
* దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గుడ్‌న్యూస్ చెప్పింది. పండగ సీజన్ వేళ రిటైల్ రుణాలపై కొన్ని రాయితీలు ప్రకటించింది. తమ యోనో యాప్ ద్వారా కారు, బంగారం, వ్యక్తిగత రుణాల తీసుకునే వారికి నూరు శాతం ప్రాసెసింగ్ ఫీజు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.