వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ తెలిపారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన ఐసీఎంఆర్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. కరోనా టీకా తయారీ కోసం దేశంలో విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మూడు రకాల టీకాలకు మానవ ట్రయల్స్ జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. కోవిడ్19 వ్యాక్సిన్ కోసం ఆన్‌లైన్ పోర్టల్‌ను కూడా ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఆన్‌లైన్ పోర్టల్‌కు వెళ్లితే.. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న టీకా ట్రయల్స్ సమాచారం మొత్తం లభ్యమవుతుందన్నారు. ఐసీఎంఆర్‌కు ఇవాళ చరిత్రాత్మకమైన రోజు అని, ఐసీఎంఆర్ వందేళ్ల టైమ్‌లైన్‌ను రిలీజ్ చేయడం గర్వంగా ఉందన్నారు. ఐసీఎంఆర్ శాస్త్రవేత్తల సేవలు అనిర్వచనీయమన్నారు. భావి తరాల శాస్త్రవేత్తలకు ఐసీఎంఆర్ ప్రేరణగా నిలుస్తుందని మంత్రి తెలిపారు.
కరోనా టీకా వచ్చే ఏడాది వరకు రాద
Related tags :