దిగ్గజ రేసర్ మైకేల్ షుమాకర్ పేరిట 91 టైటిల్స్‌తో ఉన్న ప్రపంచ రికార్డును సమం చేసేందుకు మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరో రెండు వారాలు వేచి చూడక తప్పదు. ఆదివారం జరిగిన రష్యా గ్రాండ్‌ప్రి రేసులో హామిల్టన్‌కు ఈ అవకాశం వచ్చినా ప్రాక్టీస్ సమయంలో రెండుసార్లు అతను నిబంధనలు ఉల్లంఘించాడు. ప్రాక్టీస్‌కు అనుమతిలేని ప్రాంతంలో కారు డ్రైవ్ చేస్తూ ట్రాక్‌పై రెండుసార్లు రావడంతో అతనిపై 10 సెకన్ల పెనాల్టీని విధించారు. ఫలితంగా ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించిన ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ చివరకు మూడో స్థానంలో నిలిచాడు. రెండో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్ జట్టుకే చెందిన వాల్తెరి బొటాస్ నిర్ణీత 53 ల్యాప్‌లను గంటా 34 నిమిషాల 00.364 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. బొటాస్ కెరీర్‌లో ఇది తొమ్మిదో టైటిల్‌కాగా ఈ సీజన్‌లో రెండో విజయం. ప్రస్తుతం 10 రేసులు ముగిశాక హామిల్టన్ 205 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. బొటాస్ (161 పాయింట్లు), వెర్‌స్టాపెన్ (128 పాయింట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు జర్మనీ గ్రాండ్‌ప్రి అక్టోబర్ 11న జరుగుతుంది.
రష్యన్ గ్రాండ్‌ప్రీ విజేత మెర్సిడెస్
Related tags :