Politics

మోడీ…బాలుకు భారతరత్న ఇవ్వండి-తాజావార్తలు

మోడీ…బాలుకు భారతరత్న ఇవ్వండి-తాజావార్తలు

* ఇటీవల మృతిచెందిన సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని ఏపీ సీఎం జగన్‌ కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాశారు. భారత సినీ పరిశ్రమకు ఎస్పీ బాలు విశేష సేవలు అందించారని జగన్‌ గుర్తు చేశారు. మాతృభాష తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఆయన 40వేలకు పైగా పాటలు పాడారని పేర్కొన్నారు. ఉత్తమ నేపథ్య గాయకుడిగా ఆరు సార్లు జాతీయ అవార్డులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి 25 నంది పురస్కారాలు అందుకున్నారన్నారు. ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాల పురస్కారాలూ ఎస్పీ బాలును వరించాయని సీఎం లేఖలో వివరించారు. కేంద్ర ప్రభుత్వం 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్‌ పురస్కారాలు ఎస్పీబీకి అందజేసిందని జగన్‌ గుర్తు చేశారు. సంగీతానికి ఆయన అందించిన విశేష సేవలకు గుర్తుగా భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలని ప్రధానిని జగన్‌ కోరారు.

* ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి సంబంధించిన ఆస్పత్రి బిల్లులపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలను ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ ఖండించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఓ వీడియోను పంచుకున్న ఆయన తాజాగా, ఎంజీఎం ఆస్పత్రి సిబ్బందితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన తండ్రి మరణం తమ కుటుంబాన్ని తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో తన తండ్రి చికిత్సకు అయిన మొత్తం బిల్లును చెల్లించినట్లు తెలిపారు. బిల్లు కట్టక తన తండ్రి భౌతికకాయం ఇవ్వలేదన్న ప్రచారం అవాస్తవమన్నారు.

* పంజాబ్‌ నిర్దేశించిన 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్‌ 6 వికెట్లు కోల్పోయి మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. దీంతో టోర్నీ చరిత్రలోనే ఈ జట్టు అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించి కొత్త రికార్డు నెలకొల్పింది. ఆదిలోనే బట్లర్‌(4) విఫలమైనా సంజూ శాంసన్‌(85; 42 బంతుల్లో 4క్ష్4, 7క్ష్6), స్టీవ్‌స్మిత్‌(50; 27 బంతుల్లో 7క్ష్4, 2క్ష్6) చెలరేగి ఆడారు. వీరిద్దరూ పంజాబ్‌ బౌలర్లపై ఎదురుదాడి చేసి ఓవర్‌కు పది పరుగుల చొప్పున రాబట్టారు. దీంతో రాజస్థాన్‌ 9 ఓవర్లకే 100 పరుగులు చేరింది. అయితే, నీషమ్‌ వేసిన అదే ఓవర్‌ చివరి బంతికి అప్పుడే అర్ధశతకం సాధించిన స్మిత్‌ భారీషాట్‌ ఆడబోయి షమి చేతికి చిక్కాడు. దీంతో రాజస్థాన్‌ కీలక సమయంలో ప్రధాన వికెట్‌ కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రాహుల్‌ తివాతియా(53; 31 బంతుల్లో 7క్ష్6) తొలుత పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డాడు. తాను ఎదుర్కొన్న తొలి 19 బంతుల్లో 8 పరుగులే చేశాడు. ఇక పరిస్థితి చేయి దాటిపోతున్న వేళ సంజూ విజృంభించి ఆడాడు. ఈ క్రమంలోనే అతడు శతకానికి చేరువైన సమయంలో షమి వేసిన 17వ ఓవర్‌ తొలి బంతికి ఓ భారీ షాట్‌ ఆడి ఔటయ్యాడు. దీంతో పంజాబ్‌ గెలుపు ఖాయమని అంతా భావించారు.

* హిందూ దేవాలయాలు, దేవుళ్ల విగ్రహాలపై జరుగుతున్న వరుస దాడులు ఏపీలో కలకలం రేపుతున్నాయి. ఈ సందర్భం రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ, అంతర్వేది ఘటన తర్వాత రాష్ట్రంలోని అనేక దేవాలయాలపై దృష్టిసారించామని చెప్పారు. మొత్తం 19 దేవాలయాలపై దాడులు జరిగినట్టు కేసులు నమోదయ్యాయని… వీటికి సంబంధించి 12 మంది నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. జరిగిన దాడులన్నీ ఒకదానితో మరొకటి సంబంధం లేకుండానే జరిగాయని అన్నారు.

* నా బాస్ ఓకే చెప్పారు.. నా కలలు మరోసారి నిజమయ్యాయి!: బండ్ల గణేశ్ఓ అద్భుతమైన వార్తను చెబుతాను అంటూ ఉదయం ట్వీట్11.23 గంటలకు మరో ట్వీట్పవన్ తో సినిమా నిర్మాణం అంటూ వార్తలు’నా భవిష్యత్తు గురించి ఈ రోజు ఉదయం 11.23 గంటలకు ఓ అద్భుతమైన వార్తను చెబుతాను’ అంటూ ఈ రోజు ఉదయం సినీ నిర్మాత బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు. సరిగ్గా 11.23 గంటలకు ఆయన మరో ట్వీట్ చేసి తనకు సంబంధించిన ఆ గుడ్‌న్యూస్‌ను చెప్పేశారు. ‘నా బాస్ ఓకే చెప్పారు. నా కలలు మరోసారి నిజమయ్యాయి. నా దేవుడు పవన్ కల్యాణ్‌కి ధన్యవాదాలు’ అని బండ్ల గణేశ్ చెప్పారు.గతంలో పవన్ కల్యాణ్‌తో కలిసి బండ్ల గణేశ్ పలు సినిమాలు తీసిన విషయం తెలిసిందే. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అనంతరం బండ్ల గణేశ్ సినిమాలు తీయడాన్ని వాయిదా వేశారు. పవన్‌తో ‌ కలిసి సినిమా తీసే మరో లక్కీ ఛాన్స్‌ను ఆయన కొట్టేసినట్లు తెలుస్తోంది. ఆయనకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో ఏ సినిమా వస్తుందన్న విషయం గురించి తెలియాల్సి ఉంది. మరోసారి పవన్‌తో సినిమా తీయాలని చాలా కాలంగా బండ్ల గణేశ్ ఎదురు చూస్తోన్న విషయం తెలిసిందే.

* * పార్లమెంట్ బయట, లోపల రైతుల గొంతును నొక్కేస్తున్నారంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్‌ 20న రాజ్యసభలో తీవ్ర గందరగోళం మధ్య వ్యవసాయ బిల్లులను ఆమోదించడాన్ని ప్రస్తావిస్తూ.. సోమవారం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ‘వ్యవసాయ చట్టాలు రైతులకు మరణశిక్ష వంటివి. పార్లమెంట్ లోపల, బయట రైతుల గొంతును అణగదొక్కుతున్నారు. భారత్‌లో ప్రజాస్వామ్యం చనిపోయిందనడానికి ఇదే నిదర్శనం’ అని ట్వీట్‌ చేశారు. 

* ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి సంబంధించిన ఆస్పత్రి బిల్లులపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలను ఆయన తనయుడు ఎస్పీ చరణ్‌ ఖండించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఓ వీడియోను పంచుకున్న ఆయన తాజాగా, ఎంజీఎం ఆస్పత్రి సిబ్బందితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తన తండ్రి మరణం తమ కుటుంబాన్ని తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో తన తండ్రి చికిత్సకు అయిన మొత్తం బిల్లును చెల్లించినట్లు తెలిపారు. బిల్లు కట్టక తన తండ్రి భౌతికకాయం ఇవ్వలేదన్న ప్రచారం అవాస్తవమన్నారు. 

* దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) గుడ్‌న్యూస్‌ చెప్పింది. పండగ సీజన్‌ వేళ రిటైల్‌ రుణాలపై కొన్ని రాయితీలు ప్రకటించింది. తమ యోనో యాప్‌ ద్వారా కారు, బంగారం, వ్యక్తిగత రుణాల తీసుకునే వారికి నూరు శాతం ప్రాసెసింగ్‌ ఫీజు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అప్రూవ్డ్‌ ప్రాజెక్టుల్లో గృహాలు కొనుగోలుకు ఇచ్చే రుణాలపైనా నూరు శాతం ప్రాసెసింగ్‌ ఫీజును రద్దు చేస్తున్నట్లు ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. 

* కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఇప్పటికీ కచ్చితమైన చికిత్స లేదు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు జరుగుతున్నాయి. తాజాగా మరో ఔషధం ప్రస్తుతం వాడుతున్న ఔషధాలకంటే పది నుంచి 20రెట్ల ఉత్తమ ఫలితాలు ఇస్తున్నట్లు తేలింది. ఎఫ్‌డీఏ ఆమోదించిన ‘టైకోప్లానిన్‌’ ఔషధం కొవిడ్‌ మహమ్మారిని ఎదుర్కోవడంలో సమర్థవంతంగా పనిచేస్తుండడం ఆశలు రేకెత్తిస్తోంది. 

* భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా కొన్ని మినహాయింపులు ఇస్తోంది. ఇప్పుడిప్పుడే జనజీవనం సాధారణ స్థితికి వస్తోంది. కాగా, మరో రెండు రోజుల్లో సెప్టెంబరు పూర్తవుతుంది. ప్రస్తుతం అన్‌లాక్‌ 4.0 నడుస్తుండగా, ఈరోజు లేదా రేపు అన్‌లాక్‌ 5.0ను కేంద్రం ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే మెట్రో సర్వీసులకు, నిబంధనలతో 9-12 తరగతులకు విద్యార్థులకు మినహాయింపులు ఇచ్చారు. 

* ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. రైతులను మోదీ- కేసీఆర్‌ ప్రభుత్వాలు ఇబ్బంది పెడుతున్నాయని విమర్శించారు. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ గవర్నర్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తే అనుమతి ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. వ్యవసాయ చట్టాల వెనుక అనేక కుట్రలు దాగి ఉన్నాయన్నారు. 

* రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన వ్యూహాలతోపాటు పాలనా వికేంద్రీకరణపై సలహాల కోసం నియమించిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌నకు ఫీజు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు పాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బీసీజీకి రూ.3,51,05,000 ఫీజు చెల్లించేందుకు అనుమతులు మంజూరు చేస్తూ.. ప్రణాళికా విభాగం కార్యదర్శి జి.ఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 

* మారటోరియం కాలంలో వడ్డీ మాఫీ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. గత విచారణలో కోర్టు కోరిన వివరాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరికొంత సమయం అడిగింది. ఈ మేరకు కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్(ఎస్‌జీ) తుషార్ మెహతా వాదనలు వినిపించారు. రుణాల మారటోరియానికి సంబంధించి కేంద్రం, ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంపై సమగ్ర వివరాలు సమర్పించాలని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎస్‌జీని కోరింది. 

* కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టంపై విక్షాలు భగ్గమంటున్నాయి. రైతాంగం ప్రతిఘటిస్తున్నా ఈ బిల్లుల ఆమోదించడాన్ని సవాల్‌ చేస్తూ కేరళకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ టీఎన్‌ ప్రతాపన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.  ఈ మూడు సంస్కరణలు రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలకు కోత విధించాయని పేర్కొన్నారు. వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశమని  ఆయన గుర్తు చేశారు. 

* ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి ఎలా సంక్రమిస్తోందన్న విషయంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా దీనిపై హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయోలజీ(సీసీఎంబీ) కీలక అధ్యయనం ప్రారంభించింది. ముఖ్యంగా గాలిలో వైరస్‌ వ్యాపిస్తుందా?లేదా? అనే విషయాన్ని తేల్చనుంది.