అంతర్జాతీయ కీటకశాస్త్రవేత్తల సంఘమైన ఎంటమలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికా(ఇ.ఎస్.ఏ)లోని ఒక విభాగానికి కాలిఫోర్నియా వాసి, తూర్పుగోదావరి జిల్లా పెద్దపురంకు చెందిన ప్రవాసాంధ్రుడు డా.సురేంద్ర దారా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇ.ఎస్.ఏ. లోని నాలుగు విభాగాల్లో ముఖ్యమైన, అతి పెద్దదైన, దాదాపు మూడువేలమంది సభ్యులున్న ప్లాంట్-ఇన్సెక్ట్ ఇకోసిస్టమ్స్ విభాగానికి ఆయన ఎన్నికయ్యారు. ఈ పదవికి ఎన్నికైన మొదటి తెలుగువాడు, రెండవ భారతీయుడు ఈయన కావడం విశేషం. ఒక సంవత్సరం ఉపాధ్యక్షుడిగా తదనంతరం అధ్యక్ష పదవిలో ఆయన కొనసాగుతారు. కీటకాలకు, మొక్కలకు మధ్య వుండే పరస్పర సంబంధాల అవగాహన, సస్యరక్షణ మరియు పర్యావరణ పరిరక్షణ కోణాల్లో శాస్త్రీయ పరిశోధనల ద్వారా విస్తృతపరచడం విస్త్రుతపరచడంఈ విభాగం ముఖ్య ఉద్దేశ్యం.
పెద్దాపురం ప్రవాసాంధ్రుడికి కీలక పదవి
Related tags :