కరోనా దెబ్బకు ఎవరి ఇంటికి వెళ్లలేం. స్నేహితులను కలుసుకోలేని పరిస్థితి. కార్యాలయాల్లో నిర్వహించే సమావేశాలు, విద్యార్థుల బోధన కోసం ఇప్పుడంతా ఆన్‌లైన్ వీడియో కాలింగ్ సదుపాయాన్ని వినియోగిస్తున్నారు. ఇటువంటి సమయంలో గూగుల్ తన ‘Meet’ యాప్ యూజర్లకు శుభవార్త చెప్పింది. యాప్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని వచ్చే ఏడాది మార్చి 31 వరకు అందించనున్నట్లు గూగుల్ వెల్లడించింది. గత ఏడు నెలలుగా కరోనా మహమ్మారి దెబ్బకు ఆన్‌లైన్ వినియోగం బాగా పెరిగిపోయింది. కార్యాలయాలు, విద్యాబోధనకు ఆన్‌లైన్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో గత ఏప్రిల్‌లో గూగుల్ ఖాతా ఉన్న వారికి Meet యాప్ ద్వారా 100 మందితో ఉచితంగా సమావేశాలు నిర్వహించుకునేందుకు ఎలాంటి కాలపరిమితి లేని అవకాశాన్ని సెప్టెంబర్ 30వ తేదీ వరకు కల్పించింది. అయితే ఆ గడువు ఇవాళ్టితో ముగియనుంది. దీంతో మరోసారి యూజర్లకు గడువును పొడిగిస్తూ గూగుల్ నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల కిందటే ‘Meet’ యాప్‌నకు మరో కొత్త ఫీచర్‌ను గూగుల్ చేకూర్చింది. ‘Meet’లో వీడియో కాన్ఫరెన్స్‌లో ఒకేసారి తనతో సహా 49 మందిని చూసే విధంగా అప్‌డేట్ చేసింది.
గూగుల్ Meet నూతన నిబంధన
Related tags :