Movies

నెటిజన్లకు ఖాన్ దీటైన జవాబు

నెటిజన్లకు ఖాన్ దీటైన జవాబు

తన రోజువారీ జీవితానికి సంబంధించిన ఫొటోలను తరచూ సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌ కుమార్తె సుహానా ఖాన్‌. షారుఖ్‌ కుమార్తెగా చిన్నప్పటి నుంచే ఆమె ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల కొంతకాలం నుంచి సుహానాఖాన్‌పై పలువురు నెటిజన్లు తీవ్రంగా ట్రోలింగ్‌ చేస్తున్నారు. సుహానా అంతగా బాగోదని పేర్కొంటూ కామెంట్లు పెడుతున్నారు. మరికొంతమంది నెటిజన్లు అయితే ఇంకొక్క అడుగు ముందుకేసి.. సుహానా గురించి మీమ్స్‌ కూడా తయారు చేశారు. కాగా, తనపై వస్తోన్న ట్రోలింగ్‌ గురించి సుహానా తాజాగా స్పందించారు. తన అందం గురించి కామెంట్లు చేస్తోన్న వారందరికీ దీటుగా సమాధానమిచ్చారు. ‘ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎన్నో సమస్యలు మనం చూస్తున్నాం. వాటిలో ఇది కూడా ఒకటి. దీనిని మనం రూపుమాపాలి. ఇది కేవలం నేను ఒక్కదానినే కాదు ఎంతో మంది ఎదుర్కొంటున్నారు. నేను చూడడానికి అందంగా ఉండడని నెటిజన్లు చేసిన కామెంట్లు నా దృష్టికి వచ్చాయి. నేను 12 ఏళ్ల వయస్సు ఉన్నప్పటి నుంచి నాపై ట్రోల్సింగ్స్‌ చేస్తున్నారు. నేను మాత్రం వాటిని చూసి బాధపడను. ఇలా ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను’ అని సుహానా ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు.