* ప్రభుత్వాలు అన్ని విధాలుగా కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొంత మంది అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తునే ఉన్నారు.వివిధ మార్గాల్లో అక్రమార్కులు బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అందరూ మాస్కులు ధరిస్తున్నారు.మాస్కులనే అదునుగా చేసుకొని ఓ ప్రయాణికుడు బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ దొరికిపోయారు.ఈ నేపథ్యంలో కేరళలోని తన ఎన్ -95 మాస్కులో రూ. 2 లక్షల విలువైన 40 గ్రాముల బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిన విమాన ప్రయాణికుడిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ సంఘటన కోజికోడ్ కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి ప్రయాణించిన ప్రయాణికుడిని కాలికట్ విమానాశ్రయానికి చెందిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ అరెస్టు చేసింది.
* విదేశాలకు పంపే నగదుపై మరింత పన్నువిదేశాల్లో చదువుకునే పిల్లలకు తల్లితండ్రులు పంపే నగదు, బంధువులకు సాయం చేస్తూ పంపే మొత్తాలపై అదనంగా 5 శాతం మూలం వద్ద పన్ను (టీసీఎస్) విధిస్తారు.ఆర్‌బీఐ రెమిటెన్స్ పథకం కింద విదేశాలకు పంపే మొత్తాలపై టీసీఎస్ చెల్లించాలని ఫైనాన్స్ చట్టం, 2020 పేర్కొంది
* మన రాష్ట్రంలో ప్రత్యేక రైళ్ల రాకపోకలు వివరాలను దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. అక్టోబర్ 1 నుంచి అందుబాటులో ఉండే రైళ్ల సర్వీసులు, రైళ్లు నిలిచే స్టేషన్లను ప్రకటించింది?రైళ్లు ఆగే స్టేషన్లు ఇవే?►సికింద్రాబాద్-హౌరా, హౌరా-సికింద్రాబాద్ (డైలీ) – పిడుగురాళ్ల, తాడేపల్లిగూడెం, సామర్లకోట►సికింద్రాబాద్-గుంటూరు, గుంటూరు-సికింద్రాబాద్(డైలీ)- నంబూరు, పెదకాకాని, కృష్ణా కెనాల్ జంక్షన్, కొండపల్లి►(తిరుపతి-నిజామాబాద్, నిజామాబాద్-తిరుపతి)-రేణిగుంట, కోడూరు, రాజాంపేట, ఎర్రగుంట్ల, ముద్దునుర్, తాడిపత్రి, గూటి►(హైదరాబాద్-విశాఖ, విశాఖ- హైదరాబాద్)- తాడేపల్లిగూడెం, నిడదవోలు,అనపర్తి,సామర్లకోట, పిఠాపురం,అన్నవరం,తుని, నర్సీపట్నం రోడ్, యలమంచిలి,దువ్వాడ.
* ద్విచక్రవాహనాల రంగంలో అగ్రగామి సంస్థ హోండా తన కొత్త మోడల్ బైక్‌ను విడుదల చేసింది. మోడరన్ క్లాసిక్ విభాగంలో హైనెస్ CB350 పేరుతో మోడల్ బైక్‌ను హోండా తీసుకొచ్చింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థకు చెందిన బైక్స్‌కు పోటీ ఇచ్చేలా ఉండబోతుందని నిపుణులు పేర్కొన్నారు. హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌తో భారత్‌లో ఈ వాహనాల విక్రయాలను చేపట్టనుంది. జపాన్ నుంచి తెప్పించిన పరికరాలతో మన దేశంలోనే హైనెస్ CB350 వాహనాలను హోండా కంపెనీ తయారు చేసింది. బైక్ ధర ఎంత ఉండబోతుందనేది సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ప్రారంభ ధర దాదాపు రూ.1.90లక్షలు (ఎక్స్ షోరూం) ఉండొచ్చని తెలుస్తోంది. హైనెస్ CB350 వాహనం DLX, DLX Pro రెండు వేరియంట్లలో లభించనుంది.