DailyDose

పులివెందులలో కొనసాగుతున్న వివేకా హత్య కేసు దర్యాప్తు-నేరవార్తలు

పులివెందులలో కొనసాగుతున్న వివేకా హత్య కేసు దర్యాప్తు-నేరవార్తలు

* ప్రభుత్వాలు అన్ని విధాలుగా కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ  కొంత మంది అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తునే ఉన్నారు.వివిధ మార్గాల్లో అక్రమార్కులు బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అందరూ మాస్కులు ధరిస్తున్నారు.మాస్కులనే అదునుగా చేసుకొని ఓ ప్రయాణికుడు బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ దొరికిపోయారు.ఈ నేపథ్యంలో కేరళలోని తన ఎన్ -95 మాస్కులో రూ. 2 లక్షల విలువైన 40 గ్రాముల బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి ప్రయత్నించిన విమాన ప్రయాణికుడిని పోలీసులు అరెస్టు చేశారు.ఈ సంఘటన కోజికోడ్ కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది.

* ప్రకాశం జిల్లా తెట్టు వద్ద నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కారు కి ప్రమాదం ..నెల్లూరు నుండి విజయ వాడకు తాన సొంత పనిమీద వెళ్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కారు కి ప్రకాశం జిల్లా తెట్టు వద్ద ప్రమాదము నకు గురి అయినది.ఈ ప్రమాదము లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి డ్రైవర్ రమేశ్ కి తీవ్ర గాయాలు కావలి గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు.

* ఈ నెల 27న అగరమంగళం గ్రామములోని అభయ ఆంజనేయ స్వామి ఆవరణలో నంది విగ్రహాన్ని ద్వంసం చేసిన అంతరాష్ట్ర ముఠా.గుప్తనిధుల కోసం రాష్ట్రం లోని పలు ప్రాచీణ దేవా లయాల సమాచారాన్ని సేకరించిన ముఠా.కాణిపాకం, శ్.ఋ.పురం,కర్నులులోని మంత్రాలయం, మహానంది, పత్తికొండా, అనంతపురం లోని… పెనుగొండా, కదిరి, గుంటురు జిల్లాలో వివిధ ప్రాచీణ దేవాలయాల సమాచారాన్ని సేకరించిన ముఠా.స్థానికులు ఇచ్చిన సమాచారం తో అగరమంగళం అభయ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఎంచుకున్న ముఠా.

* ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ‌యువ‌తిపై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ‌ట‌మేగాక నాలుక కోసి ఆమె మ‌ర‌ణానికి కార‌ణ‌మైన నేర‌గాళ్ల‌ను విడిచిపెట్టే ప్ర‌స‌క్తే లేద‌ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్యనాథ్ స్ప‌ష్టంచేశారు.

* సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన గెమ్మిలి కామేష్, ఏరియా కమిటీ సభ్యుడు (ఏసీఎం) ను అరెస్ట్ చేసిన జి.కె. వీధి పోలీసులు.

* వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ..ఇద్దరు మహిళలతో పాటు ఓ వ్యక్తి నేడు సీబీఐ ఎదుట హాజరు..వివేకా ఇంట్లో వంటమనిషి లక్ష్మిదేవి, పనిమనిషి లక్ష్మిలతో పాటు పులివెందులకు చెందిన మరో చెప్పుల షాపు యజమానిని విచారిస్తున్న సీబీఐ అధికారులు.