* బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా పాజిటివ్. కరోనా లక్షణాలతో బాధపడుతున్న పురందేశ్వరి. హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స.
* 24గంటల్లో 80వేల కేసులు, 1179 మరణాలు! దేశంలో 62లక్షలు దాటిన కరోనా కేసులు.
* ఏపీలో కరోనా కేసుల తీవ్రత కాస్త తగ్గుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 71,806 నమూనాలను పరీక్షించగా 6,133 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,93,484కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 48 మంది కరోనాతో మృతిచెందారు.
* కరోనా వ్యాక్సిన్‌కు షార్క్ చేపలకు సంబంధం ఏంటని అనుకుంటున్నారు.. అయితే ఇది చదవండి.. షార్క్ చేపల కాలేయం నుంచి తీసే నూనెను కరోనా వ్యాక్సిన్ తయారీలో ఉపయోగిస్తున్నారు. స్క్వాలిన్ పేరుతో పిలవబడే ఈ నూనె రోగ నిరోధక శక్తి పెంచటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కారణంతో దీని అవసరం ప్రస్తుతం అధికమైనట్లు కాలిఫోర్నియా కేంద్రంగా పని చేసే ఓ టీకా తయారీ సంస్థ అభిప్రాయపడింది. ఇప్పటికే ఈ స్వ్కాలిన్ను బ్రిటన్‌కు చెందిన ఫార్మాసూటికల్ కంపెనీ ఫ్లూ వ్యాక్సిన్ల తయారీలో వాడుతోంది.
* ద్విచక్రవాహనాల రంగంలో అగ్రగామి సంస్థ హోండా తన కొత్త మోడల్ బైక్‌ను విడుదల చేసింది. మోడరన్ క్లాసిక్ విభాగంలో హైనెస్ CB350 పేరుతో మోడల్ బైక్‌ను హోండా తీసుకొచ్చింది. రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థకు చెందిన బైక్స్‌కు పోటీ ఇచ్చేలా ఉండబోతుందని నిపుణులు పేర్కొన్నారు. హోండా బిగ్‌వింగ్ డీలర్షిప్ నెట్‌వర్క్‌తో భారత్‌లో ఈ వాహనాల విక్రయాలను చేపట్టనుంది. జపాన్ నుంచి తెప్పించిన పరికరాలతో మన దేశంలోనే హైనెస్ CB350 వాహనాలను హోండా కంపెనీ తయారు చేసింది. బైక్ ధర ఎంత ఉండబోతుందనేది సంస్థ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ప్రారంభ ధర దాదాపు రూ.1.90లక్షలు (ఎక్స్ షోరూం) ఉండొచ్చని తెలుస్తోంది. హైనెస్ CB350 వాహనం DLX, DLX Pro రెండు వేరియంట్లలో లభించనుంది.