బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కొద్ది రోజులుగా తరచు వార్తలలో నిలుస్తూనే ఉంది. సుశాంత్ మరణించిన తర్వాత నుండి సినీ, రాజకీయ ప్రముఖులని ఉద్ధేశిస్తూ తీవ్ర ఆరోపణలు చేసిన ఈ అమ్మడు ముంబైని పీవోకేగా అభివర్ణించింది. దీంతో కంగనాపై శివసేన కన్నెరజేసింది. ముంబైకి రానివ్వొద్దంటూ కూడా డిమాండ్ చేసింది. కాని హై సెక్యూరిటీ మధ్య ముంబై వచ్చిన కంగనా వారం రోజుల పాటు ఉండి తిరిగి మనాలీ వెళ్ళింది.సామాజిక అంశాలతో పాటు సమస్యలపై తరచూ స్పందించే కంగనా రనౌత్ తాజాగా ఉత్తరప్రదేశ్లోని హత్రస్లో చోటు చేసుకున్న దారుణ ఘటనపై స్పందించింది. హత్రస్కు చెందిన ఓ 20 ఏళ్ల యువతిని నలుగురు దుర్మార్గులు గ్యాంగ్ రేప్ చేయడంపై కలత చెందిన కంగనా.. రేపిస్టులని బహిరంగంగా షూట్ చేయమని కోరింది. ప్రతి సంవత్సరం ఇలా పెరుగుతూ పోతున్న సామూహిక అత్యాచారాలకు పరిష్కారం ఏమిటి? ఈ ఘటనపై దేశం సిగ్గు పడాలి. మన కుమార్తెలను కాపాడుకోలేకపోవడం సిగ్గుచేటు అంటూ కంగనా మండిపడింది.
నడిరోడ్డుపై కాల్చాలి
Related tags :