DailyDose

అనంతలో లేడీ డాక్టర్ హత్య-నేరవార్తలు

Lady Doctor Murdered In Ananthapuram - Telugu Crime News

* తెలంగాణలో 3 శాతం పెరిగిన నేరాలు*2019లో తెలంగాణలో 1,31,254 కేసులు..***తెలంగాణలో నేరాలు 3% పెరిగాయి. వృద్ధులపై దాడుల విషయంలో దేశంలోనే నాలుగోస్థానంలో తెలంగాణ నిలిచింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపైనా దాడులు ఎక్కువయ్యాయి. దేశవ్యాప్తంగా సైబర్‌ నేరాల్లో తెలంగాణ వాటా 7.2 శాతానికి ఎగబాకగా, రైళ్లలో జరిగే నేరాలూ గణనీయంగా పెరిగాయి. దొంగతనాల కేసుల్లో రికవరీ శాతం పడిపోయింది. ఈమేరకు వివరాలతో కూడిన ‘క్రైమ్‌ ఇన్‌ ఇండియా-2019’ నివేదికను జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) బుధవారం విడుదల చేసింది. దీనిప్రకారం.. 2018లో రాష్ట్రవ్యాప్తంగా 1,26,858 కేసులు నమోదవగా.. 2019లో అవి 1,31,254కు పెరిగాయి. అందులో 13,273 ప్ర మాదకర డ్రైవింగ్‌, 12,447 దొంగతనం, 6,468 నిర్లక్ష్యపు రోడ్డు ప్రమాదాలు, 2,127 కిడ్నాప్‌, 873 అత్యాచారం, 838 హత్య కేసులు ఉన్నాయి. హైదరాబాద్‌లో 2019 సంవత్సరంలో 18,051 కేసులు నమోదయ్యాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే భాగ్యనగరం పరిధిలో 2వేల కేసులు పెరగడం గమనార్హం. 2018లో ఎస్సీలపై 1507 దాడులు జరగగా.. 2019లో ఆ సంఖ్య 1690కు పెరిగింది. ఎస్టీలపైనా దాడులు 419 నుంచి 530కి పెరిగాయి.***సెల్‌ఫోన్ల ద్వారా మహిళలపై వేధింపులు..*రాష్ట్రంలో సైబర్‌ నేరాలు గణనీయంగా పెరిగినట్లు ఎన్‌సీఆర్‌బీ నివేదిక స్పష్టం చేసింది. 2017లో 1209, 2018లో 1205 సైబర్‌ కేసులు నమోదవగా.. ఒక్క 2019లోనే భారీగా 2,691 కేసులు నమోదయ్యాయి. సెల్‌ఫోన్ల ద్వారా మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువగా జరగుతున్నాయని నివేదిక తెలిపింది. సైబర్‌ కేసుల్లో 748 మందిని అరెస్టు చేయ గా.. 1594 మందిపై చార్జిషీట్‌ దాఖలు చేశారు. సైబర్‌నేరాల్లో 288 మంది మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యారు. హైదరాబాద్‌లో గత ఏడాది 1379 సైబర్‌ కేసులు నమోదవగా.. 2017లో 328, 2018లో 1375 కేసులే ఉన్నాయి. మహిళలపై నేరాలకు సంబంధించి గత ఏడాది 18,394 కేసులు నమోదవగా..**2018లో 16,027 కేసులు నమోదయ్యాయి. మహిళల వేధింపులు 2041, కిడ్నాప్‌ 1,332, లైంగిక వేధింపు ల కేసులు 677, వరకట్న హత్యలు 163, ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులు 589 ఉన్నాయి. 1,991 మంది బాలికలు లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లు నివేదిక పేర్కొంది. చిన్నపిల్లలపై 4212 కేసులు నమోదయ్యాయి. వృద్ధులపై వేధింపులు, దాడుల కేసులు గత ఏడాది 1523 నమోదుకాగా, వాటి సంఖ్య 2017లో 1308, 2018లో 1062గా ఉంది. అనుమతి లేకుండా ధర్నాలు నిర్వహించినందుకు 990, 143 సెక్షన్‌ కింద 8 కేసులు నమోదయ్యాయి. 2019లో 177 అవినీతి కేసులు నమోదుచేసి, 228 మంది ప్రభుత్వ ఉద్యోగులను అరెస్టు చేశారు. 2018లో 139 అవినీతి కేసులు, 2017లో 55 కేసులు నమోదయ్యాయి. జువెనైల్‌ చట్టం ప్రకారం మైనర్లపై 1,352 కేసులు నమోదవగా, వాటిలో 22 హత్య కేసులు కావడం గమనార్హం.**రైళ్లలో జరిగే నేరాలూ..ఇక మానవ అక్రమ రవాణా కేసులు 2018లో 242 నమోదు కాగా, 2019లో అవి 137కి తగ్గాయి. దేశవ్యాప్తంగా ఈ తరహా కేసుల్లో తెలంగాణ వాటా 6.1 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా 2,163 మానవ అక్రమ రవాణా కేసులు నమోదవగా.. మహారాష్ట్రలో 282, ఏపీలో 245, అసోంలో 201 నమోదయ్యాయి. తెలంగాణలో పోలీసు కస్టడీలో ఆరుగురు మృతిచెందారు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నలుగురు, అనారోగ్యంతో ఒకరు మృతిచెందారు. 2019లో రాష్ట్రంలో పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్నవారికి సంబంధించి 28 కేసులు నమోదయ్యాయి. విధి నిర్వహణలో ఉన్న సమయం లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది పోలీసులు ప్రాణా లు కోల్పోయారు. 17 మంది గాయపడ్డారు. రైళ్లల్లో జరుగుతున్న నేరాలు కూడా పెరిగాయి. ఇవి 2018 సంవత్సరంలో 1345 నమోదుకాగా 2019లో ఆ సంఖ్య 1545కి పెరిగింది.*దేశవ్యాప్తంగా రైళ్లల్లో జరిగే నేరాల్లో తెలంగాణ వాటా 4.1 శాతంగా ఉంది. రాష్ట్రంలో నేరాలకు పాల్పడ్డ ఇతర దేశస్థు లపై 47 కేసులు నమోదయ్యాయి. అల్లర్ల సందర్భంగా పోలీసులు రెండుసార్లు లాఠీచార్జి చేశారు. వేర్వేరు ఘటనల్లో పోలీసుల చర్యల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో రూ.128.3 కోట్ల విలువైన దొంగతనాలు జరగ్గా కేసు దర్యాప్తులో పోలీసులు రూ.71 కోట్లే రికవరీ చేశారు. 2018లో 70.6 శాతంగా ఉన్న రికవరీ శాతం , 2019లో 55.3 శాతానికి పడిపోయింది. 104 ఆయుధాలు, 214 మందుగుండును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

* లాక్‌డౌన్‌లో చీరల కోసం వెళ్లిన లేడీ డాక్టర్.. షాపుకి షట్టర్ వేసి.. అనంతపురంలో దారుణం…..ఫిజియోథెరపిస్ట్ కల్పనారెడ్డి మృతదేహాన్ని అట్టపెట్టెలో పెట్టి కల్వర్టు కింద పడేశారు. ఆనవాళ్లు తెలిస్తే దొరికిపోతామని భావించి మరుసటి రోజు వెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించారు. చివరికి..అనంతపురం జిల్లాలో కలకలం రేపిన కల్వర్టు కింద కాలిపోయిన మహిళ మృతదేహం మిస్టరీ వీడింది. చీరల కోసం దుకాణానికి వెళ్లిన మహిళపై షాపు యజమాని అత్యాచార యత్నం చేసి దారుణంగా హత్య చేసినట్లు తేలింది. అనంతరం ఆమె ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. షాపు యజమాని సహా అతనికి సహకరించిన భార్య, స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు.హత్యకు గురైన ఫిజియోథెరపిస్ట్

* యూపీలో మరో దారుణం: డ్రగ్స్ ఇచ్చి గ్యాంగ్ రేప్.. తీవ్రగాయాలతో దళిత యువతి మృతిసెప్టెంబరు 14న 19 ఏళ్ల యువతిపై ఉన్నత వర్గానికి చెందిన నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డి, నాలుక కోసి అత్యంత పైశాచికంగా దాడిచేశారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లో కామాంధుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతుంది. దేశవ్యాప్తంగా హత్రాస్ ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతుండగా… అక్కడ మరో దారుణం చోటుచేసుకుంది. హత్రాస్‌కు 500 కి.మీ. దూరంలో ఉన్న బలరాంపూర్‌లో మరో దళిత యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమె హత్యకు కారణమయ్యారు. ఆమెను అత్యంత దారుణంగా హింసించడంతో ఆసుపత్రికి తరలిస్తుండగానే మృతిచెందింది. సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులు ఆమెను తీవ్రంగా గాయపరచడం వల్లే చనిపోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

* ప్రియుడి కోసం భర్తకు మద్యంలో విషం కలిపిన భార్య12 ఏళ్ల క్రితం దేవందర్‌తో స్వప్నకు వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఇంతలో మరో గ్రామానికి చెందిన కళ్యాణ్‌తో స్వప్నకు పెళ్లి జరిగింది. వివాహేతర సంబంధం కోసం కట్టుకున్న భర్తను కడతేర్చింది ఓ భార్య. 12 ఏళ్ల పాటు కాపురం చేసిన భర్తను పరాయి మగాడి కోసం విషం పెట్టి చంపింది ఓ ఇల్లాలు. జయశంకర్ భూాపాలపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహాముత్తారం మండలం రేగులగూడెంలో దేవందర్ కుటుంబం నివాసం ఉంటుంది. అతనికి స్వప్నతో 12ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. 2017లో మహా ముత్తారం గ్రామానికి చెందిన లింగమళ్ల కళ్యాణ్ అనే వ్యక్తితో స్వప్నకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.

* వాలంటీర్ కళ్లలో కారం కొట్టి.. పింఛన్ల డబ్బులు దోపిడీఒకటో తేదీ సందర్భంగా వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేసేందుకు బయల్దేరిన వాలంటీర్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి డబ్బులు దోచుకెళ్లారు. పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. వాలంటీర్‌ని కొట్టి వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేసేందుకు తీసుకెళ్తున్న డబ్బును దోచుకెళ్లారు. ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లాలో జరిగిందిం. మడకశిర పట్టణంలోని శివపురకి చెందిన వాలంటీర్ వీరప్ప ఈ రోజు ఉదయం వృద్ధులకు పంపిణీ చేసేందుకు పింఛన్ల సొమ్మును తీసుకెళ్తుండగా గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. వాలంటీర్ కళ్లలో కారం కొట్టి రూ. 43 వేల రూపాయలు దోపిడీ చేశారు. తీవ్రంగా కొట్టడంతో వాలంటీర్ గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.