హత్రాస్‌లో గ్యాంగ్ రేప్‌కు గురై మృతిచెందిన యువతిని యూపీ పోలీసులు రెండు రోజుల క్రితం అర్థరాత్రి రహస్యంగా దహనం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ ఆ యువతి తల్లితండ్రులను కలుసుకునేందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకా గాంధీ వెళ్లారు. వాహనాల్లో వెళ్లాలనుకున్న ఆ ఇద్దర్నీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాళ్లు కాలినడకలో హత్రాస్ దిశగా పయనం అయ్యారు. ఢిల్లీ-యూపీ హైవేపై రాహుల్ కాలిబట పట్టారు. ఆ సమయంలో పోలీసులు తనను నెట్టివేసినట్లు రాహుల్ ఆరోపించారు. తనపై లాఠీచార్జ్ కూడా చేసినట్లు ఆయన ఆరోపించారు. తనను నేలపై పడేసినట్లు రాహుల్ తెలిపారు. ప్రధాని మోదీని ఈ ప్రశ్న అడగాలనుకుంటున్నానని, కేవలం మోదీజీ మాత్రమే ఈ దేశంలో నడుస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఓ సాధారణ వ్యక్తి కనీసం నడవలేరా అని ఆయన నిలదీశారు. మా వాహనాలను అడ్డుకోవడం వల్ల నడక ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. హత్రాస్‌కు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రేటర్ నోయిడా వద్ద రాహుల్ వాహనాన్ని నిలిపేశారు. అయితే వాహనాలు దిగిన రాహుల్, ప్రియాంకాలు.. వందకుపైగా కిలోమీటర్ల దూరంలో ఉన్న హత్రాస్‌కు కాలినడకన వెళ్తున్నారు. సెక్షన్ 188 కింద రాహుల్, ప్రియాంకాలను అరెస్టు చేశారు.
నన్నే కొడతారా?
Related tags :