Movies

వెంకీ బావగారు బాగా నేర్పించారు

వెంకీ బావగారు బాగా నేర్పించారు

చిత్రసీమలో క్రమశిక్షణ, సమయపాలన ఎవరూ పాటించరని, అందుకే చిత్రీకరణలు ఆలస్యంగా జరుగుతుంటాయన్న విమర్శలు వినిపిస్తుండేవి. అయితే అది గతం. ఇప్పుడు అందరూ మేల్కొన్నారు. సినిమా కోసం పరుగులు పెడుతున్నారు. కథానాయికలు సైతం ఈ విషయంలో మాట రానివ్వడం లేదు. మెహరీన్‌ కూడా అంతే. ‘‘నేను టైమంటే టైమే. ఉదయం ఏడింటికి షూటింగ్‌ అంటే.. దానికి ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయను. సినిమా అనే కాదు. ఏ విషయమైనా సరిగ్గా సమయానికి హాజరైపోతుంటాను. అందుకే స్నేహితులంతా నన్ను ఇండిగో విమానంతో పోలుస్తారు. నేను మాత్రమేకాదు, ఇప్పటి వరకూ నేను పనిచేసిన కథానాయకులంతా సమయపాలన ఉన్నవాళ్లే. ‘ఎఫ్‌ 2’ సమయంలో వెంకటేష్‌గారిని దగ్గర్నుండి గమనించాను. ఆయన కూడా అంతే. అనుకున్న సమయం కంటే ముందే ఉండేవారు. ‘అంత పెద్ద స్టార్‌ టైమ్‌ని పాటిస్తే, నేనెంత..?’ అనిపించింది’’ అని చెప్పింది మెహరీన్‌