దాదాపు ఇరవై ఏళ్ల క్రితం వెండితెర అరంగేట్రం చేసిన చెన్నై చిన్నది త్రిష తమిళ, తెలుగు భాషల్లో అగ్ర కథానాయికగా వెలుగొందింది. దాదాపు అగ్ర హీరోలందరి సరసనా నటించింది. తనతోపాటు ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్లందరూ నిష్క్రమించినా త్రిష మాత్రం ఇంకా కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఇక త్రిష పని అయిపోయిందనుకుంటున్న దశలో `96` వచ్చి అనూహ్య విజయం సాధించింది.దీంతో త్రిష ఇమేజ్ మరింత పెరిగింది. ఈ సినిమాలో నటనకుగానూ త్రిష ఏకంగా 11 అవార్డులు అందుకుంది. తాజాగా తన కెరీర్ గురించి ఓ ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడింది. “96` సినిమాపై నాకు మొదట్లో పెద్దగా నమ్మకాలు లేవు. పాత్ర చాలా సింపుల్‌గా బాగుంది అనుకున్నాను. అయితే ఆ సినిమా నాకు ఎనలేని కీర్తిని తీసుకొచ్చింది. నా కెరీర్‌లో `విన్నైతాండి వరువాయా` (తెలుగులో ఏ మాయ చేశావే) సినిమాలోని జెస్సీ పాత్ర, `96`లోని జాను పాత్ర మ్యాజిక్ క్రియేట్ చేశాయి.ఆ రెండింటినీ ఎప్పటకీ మర్చిపోలేన`ని త్రిష చెప్పింది.
ఆ రెండు సినిమాలు అద్వితీయ అనుభవం
Related tags :