* కరోనా వస్తే బెంగాల్ సీఎం ను ఆలింగనం చేసుకుంటానన్న బీజేపీ నేతకు కొవిడ్ పాజిటివ్!ఇటీవలే బీజేపీ జాతీయ కార్యదర్శిగా నియమితుడైన పశ్చిమ బెంగాల్ నేత అనుపమ్ హజ్రాకు కరోనా సోకింది. తనకు ఒంట్లో అసౌకర్యంగా ఉందని చెప్పడంతో హజ్రాకు కరోనా పరీక్షలు నిర్వహించగా, ఆ వైద్య పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయింది.అనుపమ్ హజ్రా ఇటీవల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరోనా రోగుల బాధలు ఏంటో సీఎం తెలుసుకోవాలని, తనకు కరోనా వస్తే నేరుగా వెళ్లి దీదీని ఆలింగనం చేసుకుంటానని, తద్వారా కరోనా రోగుల బాధలు ఎలా ఉంటాయో ఆమెకు తెలిసేలా చేస్తానని వ్యాఖ్యానించారు.దాంతో హజ్రా వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. కాషాయదళంపై అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు హజ్రాకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో చికిత్స కోసం కోల్ కతాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.
* సత్తెనపల్లి మండలం భట్లురు గ్రామంలో కరోన పంజాగ్రామంలో స్టడీఅవర్స్ నిర్వహించిన ప్రైవేటుట్యూషన్ సెంటర్ప్రైవేటుఉపాధ్యాయుడుకి కరోన పాజిటివ్ఉపాధ్యాయుడి తో పాటు14 మంది విద్యార్థులకు కరోన పాజిటివ్ట్యూషన్ సెంటర్లో 50 మంది విద్యార్థులతో స్టడీ అవర్ నిర్వహణవిద్యార్థులు అంత ఏడు సంవత్సరలలోపు (చిన్నారులు)తల్లిదండ్రులు చిన్నారులకు కరోన పరీక్షలు..పాజిటివ్ గా నిర్ధారణ…గుంటూరు యన్ అర్ ఐ శ్రీచైతన్య సాయి సధన్ క్వరెంటైన్ సెంటర్లకు తరలింపు…ఒక్కరోజే గ్రామము లో 39 కేసులుహుటాహుటిన గ్రామంలో సత్వర చర్యలుచేపట్టిన అధికారులుభట్లూరు యస్సీకాలనీ ని కంటోన్మెంట్ జోన్ ప్రకటించిన అధికారులుభయం గుపెట్లో భట్లూరు గ్రామం.
* వివేకా హత్య కేసు విచారణ చేస్తున్న సీబీఐ అధికారికి కరోనావివేకా హత్య కేసులో విచారణ చేస్తున్న సీబీఐ అధికారికి కరోనా సోకింది.- ఆయన గత కొద్దిరోజులుగా కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నారు.- గురువారం పరీక్ష చేయించుకోగా పాజిటివ్ నిర్ధరణ అయ్యింది.- నేడు మిగిలిన అధికారులు కరోనా పరీక్ష చేయించుకోనున్నారు.★ వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారికి కరోనా సోకింది.★ కొద్దిరోజులుగా కొవిడ్ లక్షణాలతో ఆయన బాధపడుతున్నారు.★ గురువారం ఇద్దరు కరోనా పరీక్ష చేయించుకోగా… ఒకరికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది.★ కొవిడ్ సోకటంతో ఆ అధికారి వ్యక్తిగత ఐసోలేషన్‌లో ఉన్నారు.★ ఇవాళ మిగిలిన అధికారులు కరోనా పరీక్ష చేయించుకోనున్నారు.