DailyDose

జడ్జి రామకృష్ణను అడ్డుకున్న పోలీసులు-నేరవార్తలు

జడ్జి రామకృష్ణను అడ్డుకున్న పోలీసులు-నేరవార్తలు

* జడ్జి రామకృష్ణను కొర్లగుంట దగ్గర అడ్డుకున్న పోలీసులుకొడుకుతో తిరుపతికి వస్తుండగా రామకృష్ణను అడ్డుకున్న పోలీసులురామకృష్ణ కారు తాళాలు తీసుకుని వెళ్లిపోయిన పోలీసులుపోలీసుల తీరుపై న్యాయమూర్తి రామకృష్ణ ఆగ్రహంరామకృష్ణకు మద్దతుగా రేపు మదనపల్లిలో ఆందోళనకు సిద్ధమైన ప్రజాసంఘాలురేపటి నిరసనకు అనుమతి లేదంటున్న పోలీసులు.

* ‘హాథ్రస్’​ ఘటనపై సీజేఐకి మహిళా లాయర్ల లేఖహాథ్రస్​ అత్యాచార ఘటనపై భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు మహిళా న్యాయవాదులు.- ఈ ఘటనకు సంబంధించి సాక్ష్యాలను తారుమారు చేయాలని ప్రయత్నించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.★ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్​ అత్యాచార ఘటనపై.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు 40 మంది మహిళా న్యాయవాదులు.★ ఈ ఘటనపై హైకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని జస్టిస్​ ఎస్​ఏ బోబ్డేను, కొలీజియం న్యాయమూర్తులను కోరారు.★ ఘటనకు సంబంధించిన సాక్ష్యాలను తారుమారు చేయాలని ప్రయత్నించిన పోలీసులు, పాలనాధికారులు, వైద్య సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు.

* నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గుతున్న అధికారులు ప్రస్తుతం ఇసుక కొరతను ఆసరాగా చేసుకుంటున్న కొందరు వ్యక్తులు, ట్రాక్టర్‌ యజమానులు నదులు, వాగుల నుంచి దొంగచాటున తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధిక భాగం ప్రజాప్రతినిధులకు చెందిన ట్రాక్టర్లే ఉండటంతో అధికారులు ఏమిచేయలేక మిన్నకుండిపోతున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని గోదావరి, ప్రాణహిత నదులతో పాటు మండలంలోని పలు వాగుల నుంచి జోరుగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. కొల్లూరు గోదావరి నది నుంచి రాత్రివేళ్లల్లో ఇలా ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు..వర్షాలు తగ్గుముఖం పడుతుండటంతో నిర్మాణాలు ఊపందుకున్నాయి. కోటపల్లితో పాటు చెన్నూరుకు చెందిన కొంతమంది వ్యక్తులు ఇదే అదునుగా ఇసుక అక్రమాలకు తెరలేపుతున్నారు. ఒక్కో ట్రాక్టరుకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారు. చెన్నూరు బతుకమ్మ వాగు ద్వారా మైనింగ్‌ శాఖ నిర్వహిస్తున్న ఇసుక సరఫరా వర్షాల కారణంగా నిలిచిపోయింది. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్న కొంత మంది వ్యక్తులు కోటపల్లి మండలం కొల్లూర్‌ సమీపంలోని గోదావరి నుంచి అర్ధరాత్రి ఇసుకను తరలిస్తున్నారు. మరోవైపు నక్కలపల్లి, బొప్పారం, అన్నారం, శంకరాపూర్‌, పంగిడిసొమారం, ఏడగట్ట సమీపంలోని అటవీ ప్రాంతాల్లో ఉన్న వాగుల నుంచి ఇసుకను తోడుతూ జేబులు నింపుకొంటున్నారు. ఇందులో కొందరు ప్రజాప్రతినిధులకు చెందిన ట్రాక్టర్లు ఉండటంతో సంబంధిత అధికారులు సైతం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.

* బట్టలషాపు ఓనర్ కిడ్నాప్.. సర్వం దోచేసి చార్జీలకు రూ.500.. పశ్చిమ గోదావరిలో దారుణంబట్టల దుకాణం యజమాని షాపు కట్టేసి ఇంటికి వెళ్తుండగా కారులో వచ్చిన దుండగులు అపహరించారు. అడ్రస్ అడుగుతున్నట్టు నటించి కిడ్నాప్ చేశారు. బట్టల షాపు ఓనర్‌‌ని కిడ్నాప్ చేసి కారులో కొట్టుకుంటూ తీసుకెళ్లి నగలు, నగదు అపహరించిన దారుణ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. నల్లజర్ల మండలం దూబచర్లకి చెందిన కె.రామకృష్ణ నల్లజర్లలో రెడీమేడ్ బట్టల షాపు నిర్వహిస్తున్నాడు. రాత్రి దుకాణం మూసివేసి బైక్‌పై స్వగ్రామానికి వెళ్తుండగా పుల్లలపాడు వీరమ్మ చెరువు సమీపంలో కారులో వచ్చిన దుండగులు రామకృష్ణని కిడ్నాప్ చేశారు.