15 నుంచి పాఠశాలలు!
ఈ వారం కేసులు చూశాక ఆలోచిస్తాం
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముందుజాగ్రత్త చర్యలతో కరోనా ప్రభావం నుంచి బయటపడ్డామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ వారం నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసులను పరిశీలించిన అనంతరం ఈ నెల 15 నుంచి పాఠశాలలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
గురువారం హైదరాబాద్ తుక్కుగూడ మున్సిపల్ కేంద్రంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితులను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నారని, పాఠశాలల ప్రారంభంపై ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు.
ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టీవీల్లో క్లాసులు ప్రారంభమయ్యాయని, ప్రైవేటు పాఠశాలలు ఆన్‌లైన్ క్లాసులు చెప్తున్నాయని చెప్పారూ