అమెరికన్ తెలుగు సంఘం(ATA) మహాసభలు వచ్చే డిసెంబరు నెలలో లాస్ఏంజిల్స్‌లో జరుపుదామని నిర్ణయించారు. కరోనా ఉద్ధృతి తగ్గకపోవడంతో లాస్ఏంజిల్స్ మహాసభలను రద్దుచేయాలని నిర్ణయించారు. గత 26వ తేదీన డెలావేర్‌లో జరిగిన ఆటా కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2022లో ఆటా మహాసభలు అంగరంగ వైభవంగా వాషింగ్టన్ డీసీలోని వాల్టర్ ఈ కన్వెన్షన్ సెంటరులో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు భీమిరెడ్డి పరమేశ్ తెలిపారు. ఆటాలో ట్రస్టీలను నియమించడానికి ప్రయ్తేక పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రస్టీ పదవులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, వీటిని పరిశీలించి ఎంపిక చేస్తామని తెలిపారు. నామినేషన్ ధర $500 నుండి $1000కి పెంచామని వెల్లడించారు. భారతదేశంలో రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించే ప్రవాసులు ఈ ట్రస్టీ పదవులకు పంపే దరఖాస్తులను తిరస్కరించవల్సిందిగా నామినేషన్ పర్యవేక్షక కమిటీకి సూచనలు చేసినట్లు పరమేశ్ తెలిపారు. వచ్చే జనవరి 16వ తేదీన ఆటా నూతన కార్యవర్గం ఎన్నిక లాస్‌వేగాస్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆటా తదుపరి అధ్యక్షుడు భువనేశ్ బూజాల అధ్యక్షుడిగా ఈ సమావేశాల్లో బాధ్యతలు చేపడతారు. కొత్త కార్యవర్గాన్ని కూడా ఈ సమావేశంలోనే ఎన్నుకుంటారు. విల్మింగ్టన్‌లోని స్థానిక గోదావరి ఈ సమావేశానికి భోజనాన్ని అందించింది. ఈ కార్యక్రమంలో వేముల శరత్, ఆసిరెడ్డి కరుణాకర్, పాశం కిరణ్, రవి పట్లోళ్ల, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వాషింగ్టన్ డీసీలో ఆటా తదుపరి సమావేశాలు
Related tags :