* ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దుట్టా వర్గీయుల మధ్య ఘర్షణ★ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీకి మద్దతిస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం విదితమే.★ నాటి నుంచి నేటి వరకూ వైసీపీ నేతలు, వంశీ మధ్య రెండ్రోజులకోసారైనా వివాదాలు వస్తూనే ఉన్నాయి.★ ఇప్పటికే పలుమార్లు అటు వంశీ.. ఇటు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు మీడియా మీట్ పెట్టి ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు.★ అందర్నీ కలుపుకునే వెళ్లే శక్తి తనకుందని వంశీ చెప్పగా.. ఆయన వ్యాఖ్యలు తీవ్రంగా తప్పుబట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.★ టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కార్యకర్తలను వంశీ ఇబ్బందిపెట్టాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.★ ఇలాంటి తరుణంలో తాజాగా మరోసారి వంశీ-దుట్టా వర్గీయుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.రాళ్లు రువ్వుకున్నారు!★ శనివారం నాడు గన్నవరం వైసీపీలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి.★ నియోజకవర్గంలోని బాపులపాడు మండలం కాకులపాడులో రైతు భరోసా కేంద్రం శంకుస్థాపన సందర్భంగా వివాదం నెలకొంది.★ వల్లభనేని-దుట్టా ఎదుటే ఇరు వర్గీయులు బాహా బాహికి దిగారు.★ దీంతో కాకులపాడులో ఉద్రిక్తత నెలకొంది.★ ఇరువర్గీయుల మధ్య మాటామాట పెరగడంతో అది కాస్త రాళ్లు రువ్వుకునే పరిస్థితికి దారితీసింది.★ ఈ ఘర్షణలో కొందరికి గాయాలైనట్లు తెలియవచ్చింది.★ పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలియవచ్చింది.★ ఇలా అస్తమాను వివాదాలు, ఘర్షణలు చోటుచేసుకుంటున్న పరిణామంలో వైసీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..?★ జిల్లా మంత్రులు, ఇంచార్జ్‌లు ఎలా సర్దిచెబుతారో..? వేచి చూడాలి.
* ఆంధ్రప్రదేశ్‌లో పోలీసుల తీరుతెన్నులపై విస్మయపరిచే లెక్కలను జాతీయ నేర గణాంకాల నివేదిక వెల్లడించింది.దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ పోలీస్‌లపై గత ఏడాది పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి.భారత దేశంలోని 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలీసులపై నమోదైన కేసులన్నీ కలిపితే 4,068.ఇందులో ఒక్క ఏపీ పోలీసులపైనే ఏకంగా 1,681 కేసులు ఉన్నట్లు నివేదిక బయటపెట్టింది.రెండు తెలుగు రాష్ట్రాల కన్నా పెద్దదైన మహారాష్ట్రలో పోలీసులపై 403 కేసులు నమోదయ్యాయి.ఏపీ రాష్ట్ర పోలీసులపై నమోదైన 1,681 కేసుల్లో 302 కేసులకు సంబంధించి దర్యాప్తు పూర్తి చేసి కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేసినట్లు ఎన్‌సీఆర్‌బీకి పోలీసుశాఖ వివరాలు తెలిపింది.
* ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల స్కాలర్ షిప్లు, ట్యూషన్ ఫీజులు దాదాపు రూ. 60 లక్షలు కాజేసిన కేసులో సీనియర్ అసిస్టెంట్ షేక్ జకీవుద్దీన్ చందన్ ను పోలీసులు అరెస్టు చేశారు.2018 -19 ,20 సంవత్సరాలకి విద్యార్థుల మంజూరైన స్కాలర్ షిప్లు, ట్యూషన్ ఫీజులు నకిలీ చెక్కులు, డీడీ లు సృష్టించి ఫోర్జరీ సంతకలతో కాజేసినట్లు త్రి సభ్య కమిటీ విచారణలో తేలింది.ప్రిన్సిపాల్ రామకృష్ణ పోలీసులకు పిర్యాదు మేరకు చందన్ ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
* అనంతపురం.నీరుగంటి వీధి లో దారుణం.ప్రేమపేరుతో స్వాతి అనే మహిళనిరిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని మోసం చేసిన మంగళ కాలనీ కి చెందిన ముని శేషారెడ్డి(ఆటో డ్రైవర్ )ఇపుడు నరక యాతన. చిత్రవధలు.ఇప్పటికి 4 గురు మహిళలను మోసం చేశాడని బాధితురాలు ఆవేదన.అతడి నుంచి ప్రాణ హాని ఉందని తనకి రక్షణ కల్పించాలని ప్రెస్ క్లబ్ లో ఆవేదన.తనకి న్యాయం చేయాలని డిమాండ్.
* చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కొంగనపల్లి గ్రామ పంచాయతీలో గిరిజనులపై వివక్ష కొనసాగుతోందికొల్లుపల్లి గిరిజన గ్రామానికి ప్రభుత్వం దారి ఏర్పాటు చేసింది.రెవెన్యూ రికార్డులలో మార్కింగ్ కూడా ఉంది.కొంగన పల్లికి చెందిన అగ్రవర్ణాల వారు దారిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు.ఈ విషయమై గతంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.తాత్కాలికంగా సద్దుమనిగేలా చూశారు తప్ప శాశ్వత పరిష్కారం చూపిన దాఖలాలు లేవని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ రోజు దారికి అడ్డంగా ట్రాక్టర్ వాహనాన్ని నుంచి అడ్డుకున్నారని వారు వాపోయారుగిరిజనులపై వివక్షతో అగ్రవర్ణాలు రహదారి రాకపోకలను స్తంభింప చేస్తున్నారని వారు వాపోతున్నారు.ఆధునిక సమాజంలో కూడా షెడ్యూల్ తెగలకు విలువ లేకుండా పోతోంది.గిరిపుత్రుల అభివృద్ధికి అండగా ఉంటామన్న పాలకులు దారి విషయమై పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని మండిపడుతున్నారు.
* ముప్పాళ్ల మండలం లో యువకుడి అదృశ్యం. ప్రైవేటు ఆసుపత్రులకు వైద్య పరికరాలు సరఫరా చేసే పుల్ల సాహెబ్(35) అదృశ్యం.గత సోమవారం ఇంటినుంచి వెళ్లిన యువకుడు.6 కోట్ల రూపాయలతో నగదుతో ఉడయించిన యువకుడు.యువకుడిపై సీతరామయ్య అనే భాదితుడు ముప్పాళ్ల పోలీసులకు ఫిర్యాదు.మిస్టరీగా మారిన యువకుడి అదృశ్యం.తమ కుమారుడు కనబడుట లేదని కుటుంబ సభ్యుల ఫిర్యాదు..కేసు నమోదు చేసి విచారిస్తున్న ముప్పాళ్ల పోలీసులు.