Movies

నాలో ఎగుడు దిగుడు ఉన్నాయి

నాలో ఎగుడు దిగుడు ఉన్నాయి

‘‘నేనెప్పుడూ పర్ఫెక్ట్‌గా ఉండాలనుకోలేదు. నాకున్న లోపాలతో సంతృప్తిగానే ఉన్నాను’’ అన్నారు ఇలియానా. తన ఇన్‌స్టాగ్రామ్‌లో బాడీ పాజిటివిటీ గురించి మాట్లాడారామె. మన శరీరం ఎలా ఉన్నా దాన్ని ప్రేమించగలగాలి అనే విషయం గురించి ఇలా రాసుకొచ్చారు ఇలియానా. ‘‘గతంలో నా శరీరాకృతి గురించి ఎప్పుడూ ఆలోచిస్తుండేదాన్ని. ఎలా కనిపిస్తున్నాం? బాగానే కనబడుతున్నామా? అని తెగ ఆలోచించేదాన్ని.ఆ ఒత్తిడి ఎలా ఉండేదో చెప్పలేను. నా ముక్కు షార్ప్‌గా లేదని, పెదాలు ఇంకా పెద్దగా లేవని, చేతులు సరిగ్గా లేవని, పొట్ట కొంచెం ముందుకు ఉంటుందని, నడుము పెద్దగా ఉంటుందని, ఇంకా ఎత్తు ఉండాల్సిందేమోనని, చురుకుగా లేనేమోనని, ఫన్నీగా ఉండనేమోనని, ఫర్ఫెక్ట్‌గా లేనేమో అని… ఇలా ఆలోచిస్తూ ఉండేదాన్ని.కానీ నేను ఆలస్యంగా తెలుసుకున్నది ఏంటంటే… నేను ఎందుకు పర్ఫెక్ట్‌గా ఉండాలి? ఎలా ఉన్నానో అలానే అందంగా ఉన్నానని భావించొచ్చు కదా? అనుకున్నాను. అప్పటి నుంచి అందరూ అనుకునే పర్ఫెక్ట్‌కి, బ్యూటీఫుల్‌కి నేను సరిపడతానా? లేదా? అనే ఆలోచన మానేశాను. వాళ్లు అనుకునే బ్యూటీ మీటర్‌లో సెట్‌ అవ్వడానికి ప్రయత్నించడం ఆపేశాను. ఫిట్‌ అవ్వాలని ఎందుకు ప్రయత్నించాలి? ఒక్కొక్కరం ఒక్కోలా పుడతాం. ఎలా పుట్టామో అలానే ఉండాలి కదా. మార్చుకోవడానికి ఎందుకు ప్రయత్నించాలి?’’ అన్నారు ఇలియానా.