ఒడిశాలో శౌర్య న్యూక్లియర్ బాలిస్టిక్ క్షిపణిని శనివారం విజయవంతంగా ప్రయోగించింది భారత్.
బాలేశ్వర్ ప్రయోగ కేంద్రం నుంచి దూసుకెళ్లిన శౌర్య మిసైల్‌కు. 800 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఉందని అధికారులు తెలిపారు.
శౌర్య మిసైల్ ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదిస్తుందని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.
ఈ మిసైల్ తేలికగా ఉండటం వల్ల సులభంగా ప్రయోగించవచ్చని పేర్కొన్నారు.