‘1 నేనొక్కడినే’, ‘దోచెయ్’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన కథానాయిక కృతీసనన్. అందమే కాదు అందరూ మెచ్చే చక్కని కవి హృదయమూ తన సొంతమని నిరూపించుకుంటున్నారు! ఆమె రాసిన ఓ కవితను ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘‘పడిపోయిన ప్రతిసారీ ఆమె బలం పుంజుకుంది! అదే నేను! మచ్చలు ఆమెను అందంగా చేశాయి, తిన్న ఎదురుదెబ్బలు మరింత రాటుదేలాలా చేశాయి. ఆమెను కాల్చలేము, ముక్కలు చేయలేము, ఎందుకంటే ఆమె ఒక జ్వాల, తనే ఒక పెను తుపాను’’ అని కృతీ రాశారు. ‘‘నా ఆలోచనలను కవితలుగా రాయడం నాకు ఇష్టం. కొన్నిసార్లు అందులో విషయం ఉండకపోవచ్చు. మీరేం అర్థం చేసుకుంటారు అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది’’ అని ఆమె చెప్పుకొచ్చారు.
నేను వ్రాశాను. మీరే అర్థం చేసుకోండి.
Related tags :