మహాత్మా గాంధీ మెమోరియల్ అఫ్ నార్త్ టెక్సాస్ అఫ్ ఆధ్యర్యంలో శుక్రవారం నాడు మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలు డల్లాస్ లో ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వల అతిథులను ఆహ్వానించిన అనంతరం భారత కాన్సల్ జనరల్ అసీం మహాజన్ ముఖ్య అతిధిగా హాజరై గాంధీజీ జీవితంలోని ముఖ్య ఘట్టాలను వివరించి జాతిపితకు పుష్పాంజలి ఘటించారు. ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్తోఫెర్ ప్రత్యేక అతిధిగా విచ్చేసి గాంధీజీ విశ్వమానవుడు అంటూ ఘన నివాళి అర్పించారు. హాత్మా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర గాంధీజీ సిద్దాంతాలు, ఆశయాలు అజరామరం అన్నారు. మహాత్మా గాంధీ మెమోరియల్ డైరెక్టర్స్ – అభిజిత్ రాయల్కర్, మురళి వెన్నం, రన్న జాని, రాంకీ , స్వాతి షా, శైలేష్ షా, సలహా సంఘ సభ్యులు – పద్మశ్రీ ఏ.కె మాగో , సి.సి థియోఫిన్, ఎం.వి.ఎల్ ప్రసాద్, అరుణ్ అగర్వాల్, తైయాబ్ కుండవలా, పియూష్ పటేల్, దినేష్ హూడా, రాహుల్ చటర్జీ , రాజీవ్ కామత్, ఉర్మీత్ జునేజా, సల్మాన్ ఫర్షోరి తదితరులు గాంధిజీకి శ్రద్దాంజలి ఘటించారు.
డల్లాస్లో ఘనంగా గాంధీజి 150వ జయంతి
Related tags :