DailyDose

మహిళ చెవులు కొరికేసిన వాలంటీర్-నేరవార్తలు

మహిళ చెవులు కొరికేసిన వాలంటీర్-నేరవార్తలు

* మహిళా పై వాలంటీర్ దాడి.మహిళా చెవులు కొరికేసిన వాలంటీర్.- కట్టెలు పొయ్యి నుండి పోగే మహిళా పై దాడి కి కారణం.★ వాలంటీర్ కుటుంబ సభ్యులుతో కలసి మహిళాపై కత్తులు, కర్రలతో దాడి.★ పలాస ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూన్న మహిళా.★ వజ్రపుకొత్తూరు పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసిన బాదితరాలు.★ ఇప్పటి వరకు ఎటువంటి కేసు నమోదు చేయులేదు.★ వజ్రపుకొత్తూరు మండలం మంచి నీళ్ళు పేట లో కారి లక్ష్మీ అనే మహిళ కట్టెలు పొయ్యితో వంట వండుకుంటుంది.★ పొగ పక్క ఇంట్లో వున్న వాలంటీర్ కారి రాజు,కారి శ్యామసుందరరావు ఇంట్లో కి వెల్లుతుందని మహిళాతో గొడవ పెట్టుకొని మహిళాపై కుటుంబ సభ్యులు అందరూ దాడి చేశారు.★ ఆమె చెవులును వాలంటీరు కొరికేసారు.★ మహిళా అని చూడకుండా కర్రలతో ఆమెను చితకబదారు.★ అనంతరం బాదితరాలు పోలీసులు కి పిర్యాదు చేసింది.★ పలాస ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతుంది.★ ఇప్పటి వరకు తనకు న్యాయం చేయకపోగ, కేసు కూడా నమోదు చేయలేదు అని వాపోతున్నారు.

* శంషాబాద్ విమానాశ్రయం కేంద్రంగా ముంబైకి తరలించేందుకు పంపిన కొరియర్‌లో భారీగా వజ్రాభరణాలు, బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్, ఎయిర్ కార్గోలో ఈ ఉదయం ఎయిర్ ఇంటెలిజెన్స్ అండ్ కస్టమ్స్ అధికారుల విస్తృత తనిఖీలు నిర్వహించారు. గడిచిన నాలుగైదు గంటలుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఇన్స్పెక్టర్ల సభ్యుల బృందం అధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి.ముంబయికి తరలించేందుకు స్మగ్లర్ పన్నిన పన్నాగాన్ని పసిగట్టిన కస్టమ్స్ అధికారుల బృందం ఈ తనిఖీలు చేపట్టింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో భారీ ఎత్తున బంగారం, డైమండ్ జ్యువలరీ ఆభరణాలు అక్రమ రవాణా జరుగుతుందని ఎయిర్ పోర్ట్‌లోని ఎయిర్ కార్గోలో ఈ రవాణా జరుగుతోందని డిప్యూటీ కమిషనర్‌ అధికారుల బృందానికి సమాచారం అందింది. స్వాధీనం చేసుకున్న కొరియర్‌ని ఓపెన్ చేసిన అధికారులు డైమండ్ వజ్రాభరణాలను పెద్ద పెద్ద తూనికలు కొలతలు వెయిట్‌ మిషన్ల సహాయంతో లెక్కిస్తున్నారు.  వజ్రాభరణాలుకి పైనుంచి వెండి పూత పూసి బంగారాన్ని గుర్తుపట్టకుండా అమర్చి గోల్డ్ మాఫియా తరలిస్తున్నట్టు గుర్తించారు. ముంబై వెళుతున్న పార్సెల్‌లో వజ్రాభరణాలు, బంగారం , ఆర్నమెంట్స్ అన్నీ కలిపి ఇప్పటిదాకా 21 కేజీలు గుర్తించారు. కాగా.. వీటి విలువ 30 కోట్ల రూపాయలకు పైబడి ఉంటుందని అంచనా. ఈ పార్సిల్‌ని శ్రీపాల్ జైన్ అనే వ్యక్తి  ముంబయి అడ్రస్‌కి పంపుతున్నట్టు ఉండగా అశోక్ అనే వ్యక్తి నుండి పార్సల్ ఫ్రమ్ అడ్రస్ ఉండటం విశేషం.

* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గాంధీ జయంతిని పురస్కరించుకుని జీవో, 30ను జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం జైలు నుంచి 22 మంది ,వరంగల్ సెంట్రల్ జైలు నుంచి 38, మంది ఖమ్మం జైలు నుండి నలుగురు, కరీంనగర్ జైలు నుంచి 6 మంది, ఖైదీలు చంచల్గూడ మహిళా ఖైదీలు13 మంది , 15 మంది పురుష ఖైదీలు, మెదక్ నిజామాబాద్ జైలల్లో ఎన్నికల కోడ్ తో విడుదలకు బ్రేక్.

* చిత్తూరులో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. అత్యాచార యత్నం చేసిన కామాంధుడి బారి నుంచి తప్పించుకుందో బాలిక. తీవ్రంగా ప్రతిఘటించినా విడవకపోవడంతో కొడవలితో వేటు వేసింది.

* పరీక్ష రాసేందుకు వెళ్తూ యువతి, యువకుడు మృతి.ఓ లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం ఇద్దరి ప్రాణాన్ని బలతీసుకుంది.పరీక్ష రాయడానికి వెళ్తున్న ఇద్దరు విద్యార్థులను దురదృష్టం యుముడిలా వెంటాడింది.వెనుకనుంచి వేగంగా వచ్చిన లారీ ఓ యువతి, యువకుడిని ఢీ కొట్టడంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు.వివరాల ప్రకారం.. జహీరాబాద్‌కు చెందిన శ్వేతా, శ్రీనివాస్‌ డైట్‌సెట్‌ పరీక్ష రాసేందుకు బైక్‌పై ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ పరీక్ష కేంద్రానికి వెళ్తున్నారు. మదీనాగూడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వారు ప్రయాణిస్తున్న బైక్‌ను బలంగా ఢీ కొట్టింది.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్వేత, శ్రీనివాస్‌ అక్కడిక్కడికే మృతి చెందారు.

* ఫ్లాష్…ఫ్లాష్…పురుగు మందు తాగిన వాలంటీర్ బాలాజీ…పశ్చిమ గోదావరి జిల్లాఉండి మండల పరిషత్ కార్యాలయంలో పురుగుల మందు తాగిన బాలాజీ అనే యువకుడు.ఉండి మండలం పాములపర్రు గ్రామ వాలంటరీ గా పనిచేసిన బాలాజీ.నెల రోజుల క్రితం విధుల నుండి తొలగించిన అధికారులు.ఏ తప్పు చేయకుండా తనను విధులు నుండి ఎలా తొలగిస్తారు అంటూ ఎం డి ఓ ఆఫీస్ లో పురుగుల మందు తాగిన బాలాజీ.భీమవరం లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు.

* హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ ఈనెల 06 నుంచి తెరుచుకోనుంది. లాక్ డౌన్ తో మార్చ్ 15న మూతబడ్డ జూపార్కు ను తిరిగి అక్టోబర్ 06 నుంచి తెరవనున్నట్లు అధికారు లు తెలిపారు. సందర్శకులు మాస్క్ ధరించాలని లేకుంటే లోపలికి అనుమతించమన్నారు. ప్రతి ఒక్కరూ 6 అడుగుల దూరం పాటించాలన్నారు. వృద్ధులు, 10 ఏళ్ల లోపు పిల్లలు రాకూడదని చెప్పారు. జూపార్కు లో ఎవరైనా ఉమ్మి వేస్తే రూ.1000 జరిమానా వేస్తామని హెచ్చరించారు.