Food

మలబద్ధకమా? పచ్చి బఠాణీ ప్రయత్నించారా?

మలబద్ధకమా? పచ్చి బఠాణీ ప్రయత్నించారా?

చాలా మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటారు. దీనికి పచ్చి బఠాణీలతో చెక్‌ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా పచ్చి బఠాణీలని అనేక రకాల కూరల్లో వేస్తుంటాం. కుర్మా, బిర్యానీ వంటివాటిల్లో ఎక్కువగా వాడుతుంటాం. ఇవి వేయడం వల్ల కూరకు చక్కని రుచి వస్తుంది. ఇవి ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని మనం తరచూ ఆహారంలో భాగం చేసుకుంటే దాంతో శరీరానికి చక్కని పోషణ అందుతుంది. పలు అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. మలబద్ధకంతో బాధపడేవారు పచ్చి బఠానీలను ఆకుకూరలు, కూరగాయలతో కలిపి కూరగా చేసుకుని తింటే విరేచనం సాఫీగా వస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను నాశనం చేసి మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిలను పెంచుతుంది. దీంతో అధిక బరువు తగ్గవచ్చు. గుండె సమస్యలు రాకుండా చేస్తుంది. పచ్చి బఠాణీల్లో క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు ఉన్నాయి. రోజుకు ఒక కప్పు మోతాదులో తీసుకుంటే క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది.పచ్చి బఠాణీల్లో విటమిన్‌ ఎ, బి1, బి2, సిలతోపాటు ఐరన్‌, క్యాల్షియం, పాస్ఫరస్‌లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి వీటిని ఉడికించి, ముద్దలా చేసి ఎదుగుతున్న పిల్లలకు, బలహీనంగా ఉన్న వారికి ఇస్తే బలవర్థక ఆహారాన్ని అందించిన వారమవుతాం. గుండె జబ్బులు రాకుండా చేస్తాయి. రక్తనాళాలను సంరక్షిస్తాయి. విటమిన్‌ కె వీటిలో కావల్సినంత దొరుకుతుంది. రోజుకు కప్పు పచ్చి బఠానీలను తింటే శరీరానికి నిత్యం కావాల్సిన విటమిన్‌ కెలో దాదాపు 44 శాతం వరకూ అందుతుంది.