ఈ నెల 5న ప్రారంభం కావాల్సిన జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్య సంచాలకుడు చిన వీరభద్రుడు తెలిపారు. కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో కిట్ల పంపిణీ సమయంలో తల్లులను బయోమెట్రిక్ నమోదు నుంచి మినహాయించాలని ప్రధానోపాధ్యాయుల సంఘం, వైఎస్‌ఆర్ ఉపాధ్యాయ సమాఖ్య కోరాయి. కానుకలను వాయిదా వేసినా.. పాఠ్యపుస్తకాలను మాత్రం విద్యార్థులకు అందించాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య కోరింది. ఆన్‌లైన్ ద్వారా పాఠాలు బోధిస్తున్నా పాఠ్యపుస్తకాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది.
విద్యా కానుక వద్దు. పాఠ్యపుస్తకాలు ఇవ్వండి.
Related tags :