WorldWonders

కన్యాకుమరిలో సముద్రం వెనక్కి వెళ్లింది

Ocean Goes Back In Kanyakumari - Fisherman Says Tsunami Warning

తమిళనాడులోని కన్యాకుమారి తీరంలో రెండు రోజులుగా సముద్రమట్టంలో హెచ్చుతగ్గులు ఆందోళన కలిగిస్తోంది. హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం, అరేబియా మహాసముద్రం కలిసే ఈ ప్రాంతాన్ని త్రికడలి సంగమంగా పిలుస్తారు. గురువారం సాయంత్రం అకస్మాత్తుగా సముద్రం వెనక్కి వెళ్లింది. రాత్రంతా అలాగే ఉన్న సముద్ర మట్టం ఉదయం యథాస్థితికి చేరింది. శుక్రవారం రాత్రి మళ్లీ తగ్గింది. నీళ్లు వెనక్కి వెళ్లిన సమయంలో తీరంలోని వివేకానంద మండపం, తిరువళ్లువర్‌ విగ్రహం వద్ద రాళ్ల గుట్టలు కనిపించాయి. 2004లో సునామీకి ముందు సముద్రం ఇలాగే వెనక్కి వెళ్లిందని జాలర్లు గుర్తు చేస్తున్నారు. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.