Health

చందనం విత్తనాల్లో క్యాన్సర్ కిల్లర్స్

చందనం విత్తనాల్లో క్యాన్సర్ కిల్లర్స్

ఎర్ర చందనం చెట్ల విత్తనాల్లో రొమ్ము క్యాన్సర్‌ నిరోధకాలు ఉన్నాయని బిహార్‌ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ఈ అంశానికి సంబంధించి ఎలుకలపై చేసిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. గయలోని మగధ యూనివర్సిటీలో బయో టెక్నాలజీలో మాస్టర్స్‌ చేసిన వివేక్‌ (29) ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఇందులో మనోరమ కుమారి, అరుణ్‌ కుమార్‌ పాల్గొన్నారు. వీరి అధ్యయనాన్ని అమెరికాకు చెందిన సేజ్‌ పబ్లిషింగ్‌ జర్నల్‌ ప్రచురించింది. చందనం చెక్కల్లో క్యాన్సర్‌ నిరోధకాలు ఉంటాయని గతంలోనే తేలింది. ఇప్పుడు విత్తనాల్లో కూడా ఉంటాయని వెల్లడైంది.