కరోనా బారినపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి నిశితంగా పరిశీలిస్తున్నామని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆయన పరిస్థితి మెరుగ్గానే ఉందని వారు తెలిపారు. ఆయన రక్తంలోని ఆక్సిజన్ స్థాయి 96-98 శాతం మధ్య ఉందని అన్నారు. రాబోయే 24గంటల్లో ఇంకాస్త మెరుగు అవుతారని వారు ఆశాభావం వ్యక్తపరిచారు. వాల్టర్ రీడ్ సైనిక ఆసుపత్రికి ట్రంప్‌ను తరలించి చికిత్స చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయనకు జ్వరం కూడా తగ్గిపోయిందని వైద్యులు పేర్కొన్నారు.
మెరుగ్గా ట్రంప్ ఆరోగ్యం. జ్వరం తగ్గింది.
Related tags :