అమెరికా యువ తార సోఫియా కెనిన్ సత్తా చాటింది. జోరు కొనసాగిస్తూ ఆమె ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. శనివారం ఏకపక్షంగా సాగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో కెనిన్ 6-2, 6-0తో క్వాలిఫయర్ ఇరినా బారా (రొమేనియా)ను చిత్తు చేసింది. గతేడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ నెగ్గిన కెనిన్.. ఈ ఏడాది యుఎస్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్ చేరింది. చెక్ అమ్మాయి క్విటోవా కూడా ప్రిక్వార్టర్స్ చేరింది. ఈ ఏడో సీడ్ 7-5, 6-3తో లెలా ఫెర్నాండెజ్ (కెనడా)ను ఓడించింది. మరోవైపు ఎనిమిదో సీడ్ సబలెంక మూడో రౌండ్లోనే ఓడింది. పోటాపోటీగా సాగిన సమరంలో ఆమె 6-7 (7-9), 6-2, 3-6తో ఆన్స్ జబెర్ (ట్యూనీసియా) చేతిలో పరాజయం చవిచూసింది. ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ప్రిక్వార్టర్స్ చేరడం జబెర్ ఇదే తొలిసారి. లాత్వియా స్టార్ ఒస్టాపెంకో 4-6, 3-6తో బడోసా (స్పెయిన్) చేతిలో ఓడిపోయింది. ఇతర మ్యాచ్‌ల్లో సిగ్మండ్ (జర్మనీ) 6-7 (5-7), 6-3, 6-0తో 13వ సీడ్ మార్టిచ్ (చెక్ రిపబ్లిక్)ను ఇంటిముఖం పట్టించగా.. జంగ్ (చైనా) 7-6 (7-2), 7-5తో బరెల్ (ఫ్రాన్స్)పై నెగ్గింది.
US Openలో అమెరికా యువసంచలనం
Related tags :