భాగ్యనగరంలో 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ చెప్పారు. సోమవారం నాడు డీజీపీ, నగర సీపీలతో మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై నిశితంగా చర్చించారు. ఈ సందర్భంగా సీపీలకు కేటీఆర్ పలు సలహాలు, సూచనలు చేశారు. హైదరాబాద్‌లో 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు గుమికూడే ప్రతి చోట సీసీ కెమెరా ఏర్పాటు జరగాలన్నారు. శాంతి భద్రతల నిర్వహణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం అని మంత్రి చెప్పారు. నేరస్తులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు ఎంతో కీలకమని.. అత్యంత సేఫ్ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దడమే లక్ష్యమని కేటీఆర్ తెలిపారు. సైబర్ క్రైమ్ నేరాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని డీజీపీ, సీపీలకు మంత్రి కేటీఆర్ సూచించారు.
హైదరాబాద్‌లో 10లక్షల CCTVలు
Related tags :