క్యాబ్ సేవల సంస్థ ఓలాపై లండన్ ప్రజారవాణా విభాగం నిషేధం విధించింది. ప్రజల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అమలు చేయకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకొంది. ఈ విషయాన్ని స్కైన్యూస్ వెల్లడించింది. ట్రాన్స్‌పోర్టు ఫర్ లండన్ (టీఎఫ్‌ఎల్) సంస్థ బ్రిటన్ రాజధానిలో ఓలా సేవలను నిలిపివేసింది. ఈ ఏడాది ఫిబ్రవరలోనే బెంగళూరుకు చెందిన ఓలా సంస్థ లండన్‌లో ట్యాక్సీ సేవలను అందించడం మొదలుపెట్టింది. అక్కడి మార్కెట్లోని ఉబర్, ఫ్రీనౌ, బోల్ట్, బ్లాక్ క్యాబ్ సంస్థల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంది. మరోపక్క ఉబర్ సంస్థ లండన్‌లో ఆపరేటింగ్ లైసెన్స్ పొందడానికి అర్హురాలే అని న్యాయస్థానం తీర్పు వెలువర్చిన మర్నాడే ఓలాపై వేటు పడటం గమనార్హం. దీనిపై టీఎఫ్‌ఎల్ స్పందిస్తూ ఓలాలో నిర్వహణ పరమైన, విధాన పరమైన లోపాలను గుర్తించినట్లు పేర్కొంది. లైసెన్స్ లేని డ్రైవర్లు, వాహనాలను వాడి 1000 ట్రిప్పులను తిప్పినట్లు వెల్లడించింది. అప్పీలుకు వెళ్లేందుకు ఓలా సంస్థకు 21 రోజుల గడువు ఉంది.
ఓలా నిర్లక్ష్యం…లండన్ నిషేధం
Related tags :