మన దేశంలో పవిత్రమైన మొక్కలు, చెట్లకు లెక్క లేదు. వాటిలో రావి చెట్టుకు ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఈ చెట్టును పవిత్ర చెట్టుగా ఎందుకు భావిస్తారంటే… దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మలబద్ధకం, విరేచనాలు, నపుంసకత్వం, రక్త సంబంధ సమస్యలకు ఈ ఆకులు చెక్ పెడతాయి. ఎందుకంటే రావి ఆకులో గ్లూకోజ్, ఆస్టియోరిడ్, ఫినోలిక్ వంటి గుణాలున్నాయి. ఆ మాటకొస్తే… రావి చెట్టులో ప్రతీ భాగంలోనూ ఔషధ గుణాలున్నాయి. అందుకే ఈ చెట్టును రకరకాల వ్యాధుల్ని తరిమికొట్టేందుకు ఉపయోగిస్తున్నారు. ఓవైపు ఈ చెట్టుకు పూజలు చేస్తూనే… మరోవైపు… దీని ఆకులు, బెరడు, కాండం, విత్తనాలు, పండ్లను ఔషధాల తయారీలో వాడుతున్నారు.
***రావి ఆకుల్ని ఇలా వాడండి
*ఆస్తమా తగ్గేందుకు
రావి ఆకు, పండ్లు, బెరడును విడివిడిగా ఎండబెట్టి… పొడి చేసుకోవాలి. వీటిని సమాన పరిమాణంలో కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు వాడితే, ఆస్తమా సమస్య తగ్గుతుంది. రావి ఆకు పొడిని మూడు గ్రాములు తీసుకొని, నీటిలో కలిపి… రోజుకు రెండుసార్లు తాగినా చక్కగా పనిచేస్తుంది.
*డయాబెటిస్‌కి చెక్
నాలుగు రావి ఆకుల్ని తీసుకొని… పొడి చేసి… 250 (ml) మిల్లీ లీటర్ల నీటిలో కలపాలి. ఆ నీటిని ఫిల్టర్ చేసి తాగాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే… డయాబెటిస్ చాలా వరకూ నయం అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
*పాము కాటు వేస్తే
రావి ఆకుల రసాన్ని రెండు లేదా మూడు స్పూన్లు తీసుకుంటే… పాము కాటు విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. ఐతే… పాము కాటు వేసినప్పుడు… ఈ ఆకుల రసం తీసుకునేంత టైమ్ ఉండకపోవచ్చు.
*తామరకు చెక్
రావి ఆకుల్ని తింటే తామర లాంటి వ్యాధులు రావు. రావి ఆకుతో టీ తయారుచేసుకొని తాగితే మంచిదే.
*కడుపు నొప్పి తగ్గేందుకు
రావి ఆకులు ఐదు తీసుకొని… పేస్టులా చేసి… బెల్లం కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చేసుకొని… రోజూ మూడు లేదా నాలుగు సార్లు తీసుకోవాలి.
*రక్తం గడ్డ కట్టాలంటే
రక్తం కారిపోతూ ఉంటే… రావి ఆకు, ధనియాలు, స్పటిక, షుగర్… సమానంగా తీసుకొని… గుజ్జులా కలిపి… రోజుకు రెండు మూడు సార్లు తీసుకోవాలి. ఫలితంగా రక్తం గడ్డకడుతుంది. కారిపోకుండా ఆగుతుంది. రావి పండ్లు తింటే దగ్గు, వాంతుల వంటివి తగ్గుతాయి.ఇలా రావి ఆకులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇలాంటివి తెలియక చాలా మంది తమ ఇంటి పక్కనే రావి చెట్టు ఉన్నా… దాని ప్రయోజనాల్ని పొందలేకపోతున్నారు.
రావి ఆకులు చాలా మంచివి
Related tags :