Movies

నేను ఇప్పుడు నటన నేర్చుకున్నాను

నేను ఇప్పుడు నటన నేర్చుకున్నాను

దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత స్నేహా ఉల్లాల్‌ ‘ఎక్స్‌పైరీ డేట్‌’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా రీఎంట్రీ గురించి స్పందించారు. చాలాకాలం తర్వాత సెట్‌లోకి అడుగుపెట్టాలంటే మొదట ఇబ్బందిగా అనిపించిందని అన్నారు. ‘శరీరాకృతి విషయంలో నేను ఎప్పుడూ ఇబ్బందిపడలేదు. ఐశ్వర్యరాయ్‌ల ఉన్నానని అందరూ అనుకోవడం కూడా నన్ను బాధపెట్టలేదు. ప్రమోషన్‌ కోసమే నన్ను అలా పరిచయం చేశారు. జీవితంపై నాకెలాంటి విచారం లేదు. కానీ యాక్టింగ్‌ కెరీర్‌ను మాత్రం చాలా త్వరగా ప్రారంభించానని అనిపిస్తుంటుంది. ఒకవేళ కొంతసమయం వేచి ఉండుంటే.. నటిగా నాకు నేను ఎంతో ట్రైనింగ్‌ ఇచ్చుకునేదాన్ని. అదీ కాకపోతే సినిమా రంగానికి సంబంధించిన కొన్ని విషయాలు మరింత బాగా అర్థం చేసుకునేదాన్ని.ఎన్నో సంవత్సరాల తర్వాత ‘ఎక్స్‌పైరీ డేట్‌’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాను. ఓటీటీ మీడియం నాకు చాలా కొత్త.. అందువల్ల షూటింగ్‌కి ముందు కొంచెం ఇబ్బందిపడ్డాను. సెట్‌లోకి అడుగుపెట్టగానే నా ఆలోచనలన్నీ కనుమరుగయ్యాయి. నటిగా నా బెస్ట్‌ ఇచ్చేందుకు ఎంతో ప్రయత్నించాను’ అని తెలిపారు.