వేలాది మంది మద్దతుదారులు ట్రంప్ చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.
దీంతో తన మద్దతుదారులకు చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలని భావించిన ట్రంప్ ఉన్నట్టుండి ఆసుపత్రి బయట ప్రత్యక్షమయ్యారు.
ఓ నల్లటి కారులో కూర్చుని తన మద్దతుదారుల మధ్య తిరిగారు.
ఈ సందర్భంగా ఆయన తన అభిమానులకు అభివాదం చేశారు. చప్పట్లు కొట్టి వారిని ఉత్సాహ పరిచారు. తాను బాగానే ఉన్నానన్న భరోసా వారికి కలిగేలా చేశారు.
అయితే ట్రంప్ తీరును వైద్యనిపుణులు తప్పుబట్టారు.
వైరస్ సోకిన వ్యక్తి నిబంధనల ప్రకారం బయట తిరగొద్దని తెలిసినా ట్రంప్ దాన్ని ఖాతరు చేయలేదని విమర్శిస్తున్నారు.
కొవిడ్ నిబంధనలను ఆయన ఉల్లఘించారని ఆరోపించారు.
అంతేకాకుండా ట్రంప్ ప్రయాణించిన కారులో ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆరోగ్యంపట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు.
భద్రతలో భాగంగా ట్రంప్‌తోపాటు కారులో ప్రయాణించిన సెక్యూరిటీ సిబ్బందిని 14 రోజులపాటు క్వారెంటైన్లో పెట్టాలని అభిప్రాయపడుతున్నారు.