Business

విపరీతంగా పెరిగిన నిత్యావసరాల ధరలు-వాణిజ్యం

విపరీతంగా పెరిగిన నిత్యావసరాల ధరలు-వాణిజ్యం

* మార్కెట్‌లో నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగాయి. పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి భారంగా మారాయి. 15 రోజుల వ్య‌వ‌ధిలో కొన్ని ర‌కాల నిత్యావ‌స‌రాలు ఏకంగా రూ.20 నుంచి రూ.50 వ‌ర‌కు పెరిగాయి.* బియ్యం సాధార‌ణ ర‌కం రూ.1050 నుంచి రూ.1250కి చేరింది.* కందిప‌ప్పు (నాగ‌పూర్‌) రూ.90 ప్ర‌స్తుతం రూ.110* దేశ్‌వాళీ కందిప‌ప్పు రూ.75 నుంచి రూ.90* రూ.100 ఉన్న మిన‌ప‌గుళ్లు (లావు) రూ.125* ప‌చ్చికారం రెండు రోజుల క్రితం వ‌ర‌కు రూ.140 ప్ర‌స్తుతం రూ.240* ప‌చ్చిసెన‌గ‌ప‌ప్పు రూ.75 నుంచి రూ.85కి పెరిగింది.* కుంకుళ్లు రూ.95 నుంచి రూ.140* ఎండుమిర్చి (గుంటూరు) రూ.125 నుంచి రూ.180కి పెరిగింది.* ఆయి‌ల్ ధ‌ర‌లు (స‌న్‌ఫ్ల‌వ‌ర్‌) రూ.100 నుంచి రూ.125కి చేరాయి.* శ‌న‌గ‌నూనే ర‌కాలు రూ.130 నుంచి రూ.180కి చేరాయి. ‌* ధ‌నియాలు రూ.90 నుంచి రూ.120కి పెరిగింది.* పుట్నాలు (గులాబి ర‌కం) రూ.85 నుంచి రూ.120కి పెరిగింది.* ఎర్ర గోధుమ‌ర‌వ్వ రూ.90 నుంచి రూ.140కి పెరిగింది. ‌* ఉల్లిపాయ‌లు (పాత‌వి) రూ.30 నుంచి రూ.55కి చేరింది.

* దసరా, దీపావళి పండగ సీజన్‌ నేపథ్యంలో ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ను ప్రకటించింది. అక్టోబరు 17వ తేదీన ఈ ప్రత్యేక సేల్‌ ప్రారంభం కానుంది. అయితే, ఎప్పటివరకూ ఈ ఫెస్టివల్‌ కొనసాగుతుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌లో భాగంగా అమెజాన్‌లో వస్తువులు కొనుగోలు చేసేవారు హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌/క్రెడిట్‌ కార్డును ఉపయోగించి 10శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను పొందవచ్చు. షరతులకు లోబడి ఈఎంఐలపై కూడా ఇది వర్తిస్తుంది. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ కలిగిన వారు 24గంటల ముందు నుంచే గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌లో వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు.

* భారత్‌లోని బ్యాంకులు ప్రస్తుత సమయంలో కఠిన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ పేర్కొంది. ముఖ్యంగా మొండిబకాయిలు, రైటాఫ్‌లు పెరిగాయని తెలిపింది. కరోనావైరస్‌ మహమ్మారి వ్యాప్తి కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని ఈ సంస్థ పేర్కొంది. వేగంగా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటేనే బ్యాంకులకు నష్టాలు తగ్గుతాయని వెల్లడించింది.

* దేశయ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా సానుకూల పరిణామాలు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కావడం మదుపరుల సెంటిమెంట్‌ను బలపరిచింది. ఈ నేపథ్యంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 600 పాయింట్లు లాభడి, 39,574 వద్ద ముగియగా, నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 159 పాయింట్ల లాభంతో 11,662 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.73.45 వద్ద కొనసాగుతోంది.

* దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ తయారు చేసిన విటార బ్రెజా 5.5లక్షల కార్ల మార్కును దాటింది. మార్కెట్లోకి విడుదలైన 4.5 సంవత్సరాల్లోనే ఈ మైలురాయిని అందుకోవడం విశేషం. ఈ కాంపాక్ట్‌ ఎస్‌యూవీని 2016 మొదట్లో మార్కెట్లోకి విడుదల చేశారు. బీఎస్‌-6 నిబంధనలు అమల్లోకి రావడంతో మారుతీ 4 సిలిండర్‌, 1.5లీటర్‌ మోడల్‌, కే సిరీస్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో కారును మార్కెట్లోకి తెచ్చింది. కేవలం ఈ ఆరునెలల కాలంలో మొత్తం 32 వేల యూనిట్లను విక్రయించింది. ఈ విషయాన్ని మారుతీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

* పసిడి ధరల జోరు కొనసాగుతున్న నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు తేలికపాటి ఆభరణాలను ప్రవేశపెట్టేందుకు టాటా గ్రూప్‌ ఆభరణాల బ్రాండ్‌ తనిష్క్‌ సన్నాహాలు చేస్తోంది. తక్కువ బంగారంతోనే ఆభరణాల డిజైన్‌లను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోంది. ‘2019 ఏప్రిల్‌ నుంచి చూస్తే పసిడి ధరలు దాదాపు 60 శాతం దూసుకెళ్లాయి. పరిమిత బడ్జెట్‌లో, తక్కువ బరువు ఉన్న ఆభరణాలను కొనుగోలు చేయడానికి వినియోగదారులు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఆభరణాల బరువును 20-30 శాతం తగ్గించడంపై దృష్టి పెట్టాం’ అని టైటన్‌ కంపెనీ సీఈఓ (ఆభరణాల విభాగం) అజయ్‌ చావ్లా తెలిపారు. కొనుగోలుదార్లు బడ్జెట్‌ను 10-20 శాతం పెంచినప్పటికీ.. బరువు తగ్గించాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.